పదో తరగతి పరీక్షలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోనళపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని.. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఖచ్చితంగా ఈ నెలలోనే టెన్త్ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మే-06 నుంచి ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్ పరీక్షలపై నిశితంగా చర్చించి.. ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు.
ఇప్పటికే 1 నుంచి 9వరకు పరీక్షలుండవ్..
ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలుండబోవని ఇదివరకే రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే.. ఎలాంటి సంవత్సర పరీక్షలు లేకుండానే వీరిని నేరుగా తర్వాతి తరగతికి పంపుతారని అర్థం. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులను ఎటువంటి పరీక్షలూ లేకుండా నేరుగా 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పంపించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout