KCR:తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన శ్రేణులు..
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. దాదాపు 3 నెలల విరామం తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు రావడంతో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ రావడంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన వెంట కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
కృష్ణా పరివాహక జిల్లాలైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన సమస్యలు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా చర్చిస్తు్న్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి వైద్యులు తుంటి ఎముకకు ఆపరేషన్ చేశారు. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అనంతరం నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్యం నుంచి కొంత కోలుకోవడంతో ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌కు చేరుకుని క్యాడర్‌తో ఉత్సాహం నింపారు.
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారని పేర్కొన్నారు. ఉద్యమనాయకుడిగా 14ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేస్తారని చెప్పుకొచ్చారు. హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments