KCR:తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన శ్రేణులు..

  • IndiaGlitz, [Tuesday,February 06 2024]

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. దాదాపు 3 నెలల విరామం తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు రావడంతో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ రావడంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన వెంట కేటీఆర్‌, హరీశ్‌రావు ఉన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

కృష్ణా పరివాహక జిల్లాలైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన సమస్యలు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా చర్చిస్తు్న్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి వైద్యులు తుంటి ఎముకకు ఆపరేషన్ చేశారు. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అనంతరం నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్యం నుంచి కొంత కోలుకోవడంతో ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌కు చేరుకుని క్యాడర్‌తో ఉత్సాహం నింపారు.

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారని పేర్కొన్నారు. ఉద్యమనాయకుడిగా 14ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేస్తారని చెప్పుకొచ్చారు. హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

More News

Bharat Rice:రూ.29లకే 'భారత్ రైస్' విక్రయాలు ప్రారంభం.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..?

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Hanuman:'హనుమాన్' మరో రికార్డ్.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'హనుమాన్' చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

AP Assembly:హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యులు సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడంతో వారిని సభాపతి తమ్మినేని సీతారాం

BRS:బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ..

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Rama Jogaiah: చంద్రబాబుకు అధికారం అప్పగించడమే మీ లక్ష్యమా..? పవన్‌కు జోగయ్య ఘాటు లేఖ..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి.