KCR:కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?.. ప్రజలకు కేసీఆర్ పిలుపు
Send us your feedback to audioarticles@vaarta.com
కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించి.. ఓ పాలసీ ప్రకారం పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు, రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయి. మూడేళ్లు ఆలోచించి ధరణి తీసుకొచ్చాం. దాన్ని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని తెలిపారు. ఈ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసివేస్తే మళ్లీ మొదటికి వస్తుందని పేర్కొన్నారు.
"ఈ తెలంగాణ మళ్లీ నాశనం కావొద్దన్నదే నా బాధ. మళ్లీ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసివేస్తం.. మళ్లీ పట్వారీలను పెడుతాం.. మళ్లీ దళారీలు.. దోపిడీలు స్టార్ట్ చేస్తాం.. భూములు కబ్జాలు పెడతం.. ఇదేనా కావాల్సింది? ఈ విషయాలపై గ్రామాలకు వెళ్లిన తర్వాత జనాలను పోగేసి చర్చ పెట్టాలి. మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు' కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం.. ఓటు.. ఆ ఆయుధాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీల నుంచి బరిలో నిలబడుతున్న అభ్యర్థుల గురించి మాత్రమే కాకుండా వారి వెనకున్న పార్టీల గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎన్నికలగానే ఎంతో మంది వచ్చి ఏవేవో మాట్లాడుతారని, వాటిని నమ్మొద్దని సూచించారు. ప్రతి ఒక్కరు బాగా ఆలోచించి ఓటు వేయాలని పేర్కొన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? నిజానిజాలు గమనించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments