KCR:కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?.. ప్రజలకు కేసీఆర్ పిలుపు

  • IndiaGlitz, [Thursday,November 16 2023]

కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించి.. ఓ పాలసీ ప్రకారం పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు, రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయి. మూడేళ్లు ఆలోచించి ధరణి తీసుకొచ్చాం. దాన్ని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని తెలిపారు. ఈ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసివేస్తే మళ్లీ మొదటికి వస్తుందని పేర్కొన్నారు.

ఈ తెలంగాణ మళ్లీ నాశనం కావొద్దన్నదే నా బాధ. మళ్లీ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసివేస్తం.. మళ్లీ పట్వారీలను పెడుతాం.. మళ్లీ దళారీలు.. దోపిడీలు స్టార్ట్‌ చేస్తాం.. భూములు కబ్జాలు పెడతం.. ఇదేనా కావాల్సింది? ఈ విషయాలపై గ్రామాలకు వెళ్లిన తర్వాత జనాలను పోగేసి చర్చ పెట్టాలి. మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు' కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం.. ఓటు.. ఆ ఆయుధాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీల నుంచి బరిలో నిలబడుతున్న అభ్యర్థుల గురించి మాత్రమే కాకుండా వారి వెనకున్న పార్టీల గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎన్నికలగానే ఎంతో మంది వచ్చి ఏవేవో మాట్లాడుతారని, వాటిని నమ్మొద్దని సూచించారు. ప్రతి ఒక్కరు బాగా ఆలోచించి ఓటు వేయాలని పేర్కొన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? నిజానిజాలు గమనించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

More News

Congress:కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటనకు రంగం సిద్ధం.. ధరణి స్థానంలో భూభారతి..

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే ప్రచారంలో దూసుకుపోతుంది.

Jagan:జనమే జగన్ బలం.. జగనే జనం బలం..

ఆనాడు తండ్రిని చూడటానికి జనాలు తండోపతండాలుగా పోటెత్తేవారు.. ఈనాడు ఆయన కుమారుడిని కళ్లారా చూడటానికి ఉరకలేసే ఉత్సాహంతో పరిగెత్తుతున్నారు.

Balayya:బాలయ్యతో 'యానిమల్' వైల్డ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలో ఏ టాక్‌ షోకు రాని రికార్డులు ఈ షోకు వచ్చాయి.

Nomination:ముగిసిన నామినేషన్ల ఘట్టం.. అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ

నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు మిగిలారు.

Pawan Kalyan:పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్..!

పవర్ స్టార్ అభిమానులకు కొంత బ్యాడ్ న్యూస్ లాంటి వార్త ఇది. ఇటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పవన్ బిజీగా ఉన్నారు.