నగర ప్రజానీకంపై కేసీఆర్ వరాల జల్లు
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలతో సిద్ధమైపోయాయి. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోని ప్రజలను ఆకట్టుకునే హామీలతో మేనిఫెస్టోను తయారు చేసింది. టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజానీకంపై వరాల జల్లు కురిపించారు. డిసెంబర్ నుంచి వాటర్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తన మేనిఫెస్టోలో ప్రకటించారు. 98శాతం ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీలో వర్షాలకు దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే లాక్‌డౌన్ సమయంలో మోటార్ వాహనాల పన్ను రద్దు చేస్తామని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments