ఒక్కో అమరవీరుడి కుటుంబానికి 25 లక్షలు: కేసీఆర్

  • IndiaGlitz, [Friday,February 22 2019]

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 42 మంది సీఆర్ఫీఎప్ కుటుంబాలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉగ్రమూకల దాడిలో అమరులైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఆర్ధికసాయం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుంచి వీరమరణం పొందిన సైనికుల్లో ఒక్క జవాను లేకపోయినా దేశంకోసం భారత జవాన్ల కోసం అందరికీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించి గులాబీ బాస్ తన ఉదారతను చాటుకున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని యావత్ దేశం మెచ్చుకుంటోంది.

శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే మొదట అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పుల్వామా ఉగ్రదాడి అత్యంత దారుణమైనదని వ్యాఖ్యానించారు. అనంతరం ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అమరుల కుటుంబానికి యావత్ దేశంగా అండగా ఉంటుందని, అన్ని కుటుంబాలకు పైన చెప్పిన పరిహారం అందజేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా.. రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్‌‌తో గులాబీ అధిపతి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

More News

'మ‌జిలీ' చిత్రీక‌ర‌ణ పూర్తి.. చైత‌న్య ఎమోష‌న‌ల్ ట్వీట్‌

పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం 'మజిలీ'.

దాని కోసం మహేష్ ఆస‌క్తి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ...తిరుగులేని ఇమేజ్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్‌. త్వ‌ర‌లోనే ఓ అరుదైన ఫీట్ సొంతం కానుంది. విష‌య‌మేమంటే.. మ‌హేష్ మైన‌పు ప్ర‌తిమను మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు.

10 మంది టీడీపీ అభ్యర్థులు ఫిక్స్.. మంత్రికి నో టికెట్

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ‘సైకిల్’ స్పీడ్ పెంచారు. అందరి కంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టిన బాబు..

జగన్‌తో భేటీ ఎఫెక్ట్: ఎన్టీఆర్‌‌కు చంద్రబాబు ఫోన్!

టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, సీఎం చంద్రబాబు నార్నె శ్రీనివాసరావు.. వైసీపీ అధినేత జగన్‌‌మోహన్‌‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలున్నాయా..?

'ఆపీ ఫిజ్‌‌' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్

రీల్ అయినా.. రియల్‌‌ లైఫ్‌‌లో అయినా నందమూరి హీరో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ రూటే వేరు. కథలను ఎంచుకోవడంలోనూ.. బుల్లి తెరపైకి వచ్చి అభిమానుల్లో ఉత్సాహం