కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. ఏంటిది ఎందుకిలా చేస్తోందో..!?
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే టికెట్లపై నగదు వసూలు చేయడం, కరెంట్ తమ ఆధీనంలోకి తీసుకుంటామనే విషయాలపై కేసీఆర్ ఒకింత సీరియస్ అయ్యారు. ‘కేంద్రం తప్పుడు విధానాలను అవలంభిస్తోంది. కరోనాకు ముందు తర్వాత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. ‘తెలంగాణ రాష్ట్రానికి నెలకు 15వేల కోట్లు రూపాయిలు వస్తుంది. కేంద్రానికి ఇవ్వాల్సిన వాటా పోతే 11వేల కోట్ల రూపాయిలు తెలంగాణకు వస్తుంది. జీతాలు ఇవ్వడానికే 3వేల ఇవ్వడానికే సరిపోతుంది. ఈ పరిస్థితిని నేను చాలా స్పష్టంగా వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకి చెప్పాను. ఆర్థిక నియంత్రణ అనేదానిపై కేంద్రం దగ్గర అధికారం ఉంది. మీరు డబ్బులివ్వండి లేదా మాకు ఆ అధికారం ఇచ్చేయండి. హెలికాఫ్టర్ లేదా ఏరోప్లాన్ మనీ ఇవ్వమని అడిగాం. కేంద్రం పరిస్థితి అస్సలు సర్లేదు. వలస కూలీలు ఇళ్లకెళ్లేందుకు ట్రైన్ టికెట్లు వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు కోట్ల రూపాయిలు కట్టినాం. రైల్వే ఛార్జీలు ఇచ్చేంత డబ్బు కూడా కేంద్రం దగ్గర్లేదా..?. నేను ఉదయం సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడినం. కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో పాటు.. సౌత్ సెంట్రల్ జోన్ కీలకాధికారి గజానన్ మాల్యాతో మాట్లాడాను. స్పెషల్ ట్రైనే వేసినందుకు 30 రూపాయిలు..రిజర్వేషన్‌కు 20 రూపాయిలు వసూలు చేయడం దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో దారుణంగా ప్రవర్తించడం సబబు కాదని నేరుగా హోం శాఖా మంత్రితోనే నేను మాట్లాడాను. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైళ్లు నడపాలని అడిగాయి. కానీ ఎందుకో ఇలా ప్రవర్తిస్తోంది. రేపొద్దున దేశ ప్రజలకు కేంద్రమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది చాలా దారుణం..
‘ఎఫ్ఆర్‌బిఎమ్ (FRBM) విషయంలో కూడా కేంద్రాన్ని నేను రెక్వెస్ట్ చేశాను. కేంద్రంతో అన్ని రాష్ట్రాలకూ.. మాకు అప్పులున్నాయి. లోన్స్ అన్నీ రీ షెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రాలు చెల్లించాల్సిన ఎఫ్ఆర్‌బియంతో పాటు ఇతర లోన్లను పోస్ట్ పోన్ చేయండని అడిగాం కానీ కేంద్రం చేయట్లేదు. ఇది చాలా దారుణం. కేంద్రం ఎందుకిలా ప్రవర్తిస్తుందో తెలియట్లేదు. కొన్నిరోజులు చూసి కచ్చితంగా మా నిరసన వ్యక్తం చేస్తాం. మీరు ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వండి లేదా ఆ అధికారం మాకు ఇచ్చేయండి’ అని కేసీఆర్ కాసింత ఘాటుగానే మాట్లాడారు.
కరెంట్ విషయమై..
‘కరెంట్ విషయాలపై కేంద్రం ఏదేదో చేస్తోందని మా దృష్టికి వచ్చింది. ఈఆర్సీలను అపాయింట్ చేసే అధికారం మాకు (రాష్ట్రాలకు) ఉంది. దీన్ని తీసేసి కేంద్రం అధికారం తీసుకుంటుందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆకు అంటే అంతకుమించి బీజేపీ ప్రభుత్వం రెండాకుల్లాగా ప్రవర్తిస్తోంది. కరెంట్‌ను మొత్తం సెంట్రలైజ్ చేస్తామని కేంద్రం చెబుతోంది. ఇది నిజంగా పద్ధతి కాదు. కేంద్రం తెచ్చే ఎలక్ట్రసిటీ బిల్లును అస్సలు రానియం. ఇది ఫెడరల్ స్పూర్తికి పూర్తిగా విఘాతం. ఇది నిజంగా పద్ధతి కాదు. ఎలక్ట్రసిటీ బిల్లును మేం వ్యతిరేకిస్తాం.. ఈ విషయంలో భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తాం (అన్ని ప్రతిపక్షపార్టీలను ఏకం చేస్తాం). ఇదే జరిగితే కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్తుంది. వాళ్లు ఎలా చెబితే మనం అలా చేయాల్సి వస్తుంది. ముక్కు పిండి వసూలు చేస్తారు. సబ్సిడి ఇవ్వొద్దని చెప్పడం కూడా దారుణం. ఉదాహరణకు మనం ఇచ్చే 24 గంటల కరెంట్‌ను రేపొద్దున 14 గంటలే ఇవ్వాలని కేంద్రం చెబుతుంది. ఇది సబబు కాదు. రైతులకు అలా కరెంట్ చేయడం మంచిది కాదు. కేంద్రం చెబుతున్నదే అమలు చేస్తే వ్యవసాయానికి ఛార్జ్ పెట్టాలి.. వంద శాతం మీటర్లు పెట్టాలి.. ఇది నింజగా రాష్ట్రాల హక్కులను హరించడమే. ఆర్థిక విషయంతోపాటు కరెంట్ విషయంలోనూ కేంద్రం ఇక మౌనం పక్కనెట్టి క్లారిటీ ఇవ్వాలి. కేంద్రం మాత్రం ఇలాంటి విషయాల్లో బెల్లం కొట్టిన రాయిలా ప్రవర్తించడం దారుణం. కేంద్రం చాలా ఇచ్చిందని చెబుతోంది కానీ.. ఇచ్చిందేమీ లేదు. ఇచ్చిన వాటిలో ఆర్బీఐ బాకీలు కట్ చేసుకుంది. ఇదేం పద్ధతి.. అస్సలు బాగాలేదు’ అని కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కూడా కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు తమాషాలు చేస్తున్నాయని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
కేసీఆర్ బతికున్నంతవరకూ..
రైతు బంధు పథకం యథావిధిగా కొనసాగుందని.. సీఎం కేసీఆర్ బతికున్నంతవరకూ ఇది కచ్చితంగా సాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, పేదల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రుణమాఫీ రూ. 1200 కోట్లు రేపే (బుధవారం) విడుదల చేస్తున్నామని రైతులకు కరోనా కష్టకాలంలోనూ శుభార్త చెప్పారు. ఐదున్నర లక్షలమందికి రుణమాఫీ అవుతుందన్నారు. రూ. 25వేల లోపు ఉన్నవారికి బుధవారమే రుణమాఫీ అవుతుందన్నారు. చెప్పామంటే కచ్చితంగా వంద శాతం చేసి తీరుతామని అని స్పష్టం చేశారు. అందరికీ రైతు బంధు ఉంటుంది.. కేసీఆర్ బతికున్నంతవరకూ ఇది కొనసాగుతుందని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా.. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మే-17తో ముగియనుండటంతో.. దాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. మే-29 వరకు అంటే కేంద్రం ప్రకటించిన దానికంటే ఇంకో 12 రోజుల ఎక్కువగా తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ మేరకు కొన్ని సడలింపులతో కూడిన లాక్ డౌన్ మార్గదర్శకాలను కేసీఆర్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout