'నమస్తే నేస్తమా' తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది - పాపులర్‌ ఫిలింమేకర్‌ కె.సి.బొకాడియా

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్‌ సాధించిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన 'తేరి మెహర్భానియా' చిత్రానికి పార్ట్‌-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా. ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ న‌టుడు శ్రీరామ్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తున్నారు. రెండు కుక్క‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి.బొకాడియా, చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్‌ రాథోర్‌, హీరోయిన్‌ ఈషానియ మహేశ్వరి, కో- ప్రొడ్యూసర్‌ ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, ఫైట్‌ మాస్టర్‌ బి.జె శ్రీధర్‌, రాజ్‌ కుమార్‌ బొకాడియా, నటుడు తాగుబోతు రమేష్‌ పాల్గొన్నారు..

ఫైట్‌ మాస్టర్‌ బి.జె.శ్రీధర్‌ మాట్లాడుతూ - ''ఎంతో మంది లెజెండరీ ఫైట్‌ మాస్టర్స్‌తో వర్క్‌ చేసిన బొకాడియా గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఒక డాగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేయడం కొత్త విషయం. యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా బాగా వచ్చాయి. అన్నివర్గాల వారికి ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు.

చిత్ర సమర్పకులు గౌతమ్‌ చంద్‌ రాథోర్‌ మాట్లాడుతూ - ''చాలా పెద్ద సినిమా..మా టీమ్‌ అందరం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. 64 సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్‌ ప్లే రైటర్‌గా తనని తాను ప్రూవ్‌ చేసుకున్న బొకాడియా గారు తెలుగులో తీస్తున్న మొదటి సినిమా. 'తేరి మెహర్భానియా' సినిమాకి పార్ట్‌-2 . ఆ చిత్రంలాగే 'నమస్తే నేస్తమా' చిత్రం కూడా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాము'' అన్నారు.

హీరోయిన్‌ హీరోయిన్‌ ఈషానియ మహేశ్వరి మాట్లాడుతూ - ''నమస్తే నేస్తమా' ఒక బ్యూటిఫుల్‌ ప్రాజెక్ట్‌. ఇది ఒక డాగ్‌ సెంట్రిక్‌ మూవీ అయినప్పటికీ ఈ సినిమాలో డ్రామా, ఎమోషన్‌, రొమాన్స్‌ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయి. బొకాడియా గారు వెరీ టాలెంటెడ్‌ ఫిలిం మేకర్‌. ఎంతో మంది స్టార్‌ హీరోలను, హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేసిన బొకాడియా గారి సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం'' అన్నారు.

పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి. బొకాడియా మాట్లాడుతూ - ''మాది రాజస్థాన్‌ లోని చిన్న గ్రామం, మా నాన్న గారు ఒక్కసినిమా కూడా చూడలేదు. అలాంటి ఒక ఫ్యామిలీ నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో సంజీవ్‌ కుమార్‌తో 'రివాజ్‌' సినిమాను నిర్మించడం నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆతరువాత 1985లో 'ప్యార్‌ జుక్తా నహి' విడుదలైన అన్ని భాషలలో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరంలో మానాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద 'బి.ఎం.బి' ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి నిర్మించిన 'తేరి మెహర్భానియా' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా కూడా దాదాపు అన్ని భాషలలో రీమేక్‌ అయింది. ఈ తరువాత మా ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఆ తరువాత నా డైరెక్షన్‌లో అమితాబ్‌ హీరోగా 'ఆజ్‌ కాఅర్జున్‌' సినిమా వచ్చి గొప్ప విజయం సాధించింది. తరువాత అమితాబ్‌ గారితో చాలా సినిమాలకు వర్క్‌ చేయడం జరిగింది. ఏ డైరెక్టర్‌ దగ్గర వర్క్‌ చేయడకుండానే మద్రాస్‌ డైరెక్టర్‌ మణివన్నన్‌ గారి దగ్గర అరగంట ట్రైనింగ్‌ తీసుకొని దర్శకత్వం వహించాను. ఆ తరువాత లతామంగేష్కర్‌ గారు నాకు చాలా సపోర్ట్‌ చేసి నా నిర్మాణంలో, దర్శకత్వంలో చాలా పాటలు పాడడం జరిగింది.

నేను రజినీకాంత్‌ గారితో 5 సినిమాలకు వర్క్‌ చేయడం జరిగింది. అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవగన్‌, సన్నీదేవన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్ అలా 100కు పైగా పెద్దపెద్ద స్టార్స్‌తో వర్క్‌ చేయడం జరిగింది. ప్రియాంక చోప్రాని హీరోయిన్‌గా పరిచయం చేసింది నేనే. దీనంతటికి మీ మీడియా వారి ప్రోత్సాహమే కారణం. మీరు లేకుంటే నేను లేను. 'నమస్తే నేస్తమా' నా ఫస్ట్‌ తెలుగు మూవీ. అలాగే నాకు చాలా ఇష్టమైన మూవీ. 'తేరి మెహర్భానియా' ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ తప్పకుండా సూపర్‌ అవుతుంది అనుకుంటున్నాను. రెండు డాగ్స్‌తో ఈ సినిమా తీయడం జరిగింది. మీ అందరికీ సుపరిచితుడు అయిన శ్రీరామ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అలాగే బ్రహ్మనందం, నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, తదితరులు నటించారు. ఈ సినిమా విజయంనాకు తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాకు ఎంతో సహకరిస్తున్న బి.ఎ.రాజు గారికి ధన్యవాదాలు'' అన్నారు.

నటుడు తాగుబోతు రమేష్‌ మాట్లాడుతూ - 'ఈ సినిమాలో బ్రహ్మనందం గారు పోలీస్‌ డాగ్‌ ట్రైనర్‌ ఆయనకి అసిస్టెంట్‌గా నటించాను. చాలా మంచి క్యారెక్టర్‌. బొకాడియా గారు ఎంతో మంది స్టార్స్‌తో వర్క్‌ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్‌ షూటింగ్‌లో తెలుస్తుండేది. ప్రతి సీన్‌ పర్ఫెక్ట్‌గా వచ్చేలా ప్లాన్‌ చేసే వారు. ఆయన దర్శకత్వంలో వర్క్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.

శ్రీరామ్‌, ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌, సంగీతం: బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బి. లెనిన్‌, ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌, సమర్పణ: లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌, కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌, ర‌చ‌న‌- దర్శకత్వం: కె.సి. బొకాడియా.

More News

అయోధ్య తీర్పుపై లైవ్ అప్ డేట్స్

అయోధ్య తీర్పుపై లైవ్ అప్ డేట్స్

‘ఎవరూ చేయని పని వైఎస్ జగన్ చేస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని విజయం సొంతం చేసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కమ్మరాజ్యం నుంచి ‘పప్పులాంటి అబ్బాయ్..’ పాటొచ్చేసిందోచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

పోలవరంపై ఉదయం షాకింగ్.. సాయంత్రం గుడ్ న్యూస్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరంపై గత కొన్ని రోజులుగా ఇటు కోర్టులు...

అనారోగ్యంపై స్పందించి.. క్లారిటీ ఇచ్చుకున్న యాంకర్ ప్రదీప్

టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్.. గత కొన్నిరోజులుగా స్క్రీన్‌పై కనపించకపోవడంతో అసలేం జరిగింది..?