ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడికి జోడిగా కావ్యా థాపర్
Send us your feedback to audioarticles@vaarta.com
ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్త ఈయన తనయుడు రాహుల్ విజయ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్ నిర్మాత. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కావ్యా థాపర్ పరిచయం కానుంది. ఈ సందర్భంగా...
కావ్యా థాపర్ మాట్లాడుతూ - "నేను ముంబైలోనే పుట్టి పెరిగాను. నేను బిఎంఎస్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను. గత ఏడాది నుండి యాక్టింగ్ చేయడానికి సన్నద్ధం అయ్యాను. అతుల్ మోంగియాగారి వద్ద నటనలో శిక్షణ తీసుకన్నాను. పతాంజలి, డైజస్ట్ బిస్కట్స్, సేఫ్‌డ్ డిజర్టెంట్, ఫ్యాషన్ బిగ్ బజార్, మేక్ మై ట్రిప్ వంటి వాటికి బ్రాండ్‌లకు సంబంధించిన యాడ్స్‌లో నటించాను. ఇప్పుడు విజయ్ మాస్టర్ తనయుడు రాహుల్ విజయ్‌తో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. కొత్తనటీనటులను, టెక్నిషియన్స్‌ను ఆదరించే ప్రేక్షకులను నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments