ఆ పార్టీ లోకి కవిత
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ లో కొనసాగుతున్న కవిత ఇప్పుడు పార్టీ మారనున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మహానాడు లో తనను వేదిక పైకి పిలవకుండా అవమానించారని కంటతడి పెట్టుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యం, పవర్ చేతికి వచ్చాక ఇవ్వట్లేదంటూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆమె ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కవిత బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అయినట్లు సమాచారం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది బీజేపీనేనని తాను భావిస్తున్నట్లు, అందుకోసమే బీజేపీ లోకి రావాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారని తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments