Kavitha:లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన..

  • IndiaGlitz, [Monday,March 18 2024]

ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కీలక ప్రకటన విడుదల చేసింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ప్రకటించింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారని స్పష్టంచేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు చేశామని.. ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో తనిఖీలు నిర్వహించామని వెల్లడించింది.

లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని.. మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని పేర్కొంది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే ఈ కేసులో అరెస్ట్ చేసిన కవితను ఏడు రోజుల కస్టడీకి ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతించిందని.. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించిందని తెలిపింది. హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించిన సమయంలో ఆమె బంధువులు ఆటంకం కలిగించారని ఆ ప్రకటనలో వివరించింది.

కాగా ఈడీ కార్యాలయంలో రెండో రోజు విచారణ పూర్తి కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె భర్త అనిల్ మాత్రం రాలేదు. ఈ కేసులో ఆయనకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను 10 రోజుల పాటు విచారణకు హాజరుకాలేనని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆయన వివరణపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నోటీసులు ఇవ్వమని.. చర్యలు తీసుకోమని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది ఆన్‌లైన్‌లో పిటిషన్ నమోదుచేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం న్యాయస్థానం విచారించనుంది.

More News

కూటమి కథ కంచికేనా.. సభ అట్టర్ ఫ్లాప్‌తో బాబు, పవన్ ఆశలు గల్లంతు..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చాక చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రజాగళం పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే.

EC:ఈసీ సంచలన నిర్ణయం.. పలు రాష్ట్రాల అధికారులపై వేటు..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Nithin:12 ఏళ్ల తర్వాత హిట్ కాంబోలో నితిన్ సినిమా.. ఈసారి భారీగా ప్లాన్..

యువ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. చివరగా నాలుగేళ్ల క్రితం వచ్చిన 'భీష్మ' సినిమాతో హిట్ అందుకున్నాడు.

Mudragada: సినిమాల్లో పవన్ హీరోమో..రాజకీయాల్లో నేనే హీరో.. పవన్‌పై ముద్రగడ సెటైర్లు..

ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన మరుసటిరోజే పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.

Kejriwal: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది.