చిన్మయి పై ధ్వజమెత్తిన కవిత
Send us your feedback to audioarticles@vaarta.com
మహిళలకు వివిధ రంగాల్లో ఎదురవుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీటూ ఉద్యమం మొదలైంది. ఇటు బాలీవుడ్, సౌత్ సినిమా రంగానికి చెందిన పలువురు మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక సమస్యలను డైరెక్ట్‌గా ప్రస్తావించారు. చాలా మంది ప్రముఖలు పేర్లు బయటపడ్డాయి. సౌత్ సినిమా విషయానికి వస్తే.. సింగర్ చిన్నయి మీటూ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు.
అందులో భాగంగా ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆమె ఆరోపణలు కూడా చేశారు. నటి అమలాపాల్ దర్శకుడు సుశీగణేశన్‌పై ఆరోపణలు చేశారు. మీ టూ ఉద్యమం జోరుగా సాగుతున్న క్రమంలోటూ డబ్బింగ్ యూనియన్‌పై ఆమె మాట్లాడిన తీరు బాలేదం డబ్బింగ్ ఆర్టిస్ట్ కవిత చిన్నయిపై ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ "నాకు చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా తెలుసు. చిన్మయి తనకు ఉన్న వ్యక్తిగత సమస్యను సినిమా రంగంలోని క్రాఫ్ట్‌కు ఆపాదించేశారు. మగవాళ్లందరూ తప్పు అని అంటున్నారు. సుచి లీక్స్ అంటూ సుచిత్ర కొన్ని వీడియో టేప్‌లను బయట పెట్టినప్పుడు ఇదే చిన్నయి సుచిత్ర మెంటల్ అని సంబోధించింది. మరిప్పుడు మీ టూ ఉద్యమం అప్పుడు ఎక్కడకు వెళ్లింది.. సుచిత్ర మెంటల్ అయితే ఇప్పుడు చిన్మయి మెంటలా? చిన్మయికి మీ టూ అంటే ఏంటోతెలియడం లేదు.
మహిళల కోసం.. వారి హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం అది. అటువంటి దాన్ని ఎలా ముందుకు నడపాలో ఎవరికీ తెలియడం లేదు. చిన్మయి వెంట ఎప్పుడూ ఆమె అమ్మగారు ఉండేవారు. ఆమెకు ఎదురైన చేదు అనుభవం గురించి ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ జరిగి ఉంటే.. పోలీస్ స్టేషన్స్ లేవా? ఇంట్లో పెద్దవాళ్లు లేరా? వాళ్లకి చెప్పనవసరం లేదా? రీసెంట్‌గా ఆతూర్‌లో పదమూడేళ్ల అమ్మాయి గొంతు కోసి చంపేశారు. అప్పుడు మీ టూ ఉద్యమంలో చిన్మయి.. లక్ష్మి గారు ఎక్కడికి పోయారు.
అమ్మాయిలు ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలి. ఇలాంటి సమస్యలు అన్ని రంగాల్లో ఉన్నాయి. కాకపోతే సినిమా రంగానికి ఉన్న ఎక్స్‌పోజర్ వల్ల సినిమా రంగంలోనే ఈ సమస్యలు అని అనుకుంటున్నారంతే. ఇలాంటి పనులు వల్ల చిన్మయి తనను తాను తగ్గించేసుకుంటున్నారు. డబ్బింగ్ యూనియన్‌లో 15 కేసులున్నాయని ఆమె అంటున్నారు. అలాంటివేమీ లేదు. తన సమస్యను తాను పరిష్కరించుకోలేక బయటకు తెచ్చుకుంది. మరి మరో డిపార్ట్‌మెంట్ గురించి ఎలా మాట్లాడుతుంది. తనకు ఆ హక్కే లేదు" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments