ఎమ్మెల్సీగా కవిత పోటీ.. కేసీఆర్ ప్లాన్ ఇదేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయ చదరంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం గ్యాప్ తీసుకున్న కవిత.. ఎట్టకేలకు మళ్లీ క్రియాశీలమయ్యారు. మొదట కవితను రాజ్యసభకు పంపి.. ఢిల్లీ వేదికగా కేసీఆర్ చక్రం తిప్పుతారని భావించనప్పటికీ అది జరగలేదు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం.. మరోవైపు కవిత ఖాళీగా ఉంటే విమర్శలు వెల్లువెత్తడంతో చేసేదేమీ లేక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపారు కేసీఆర్. బుధవారం నాడు ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాగా.. ఆమె గెలుపు దాదాపు లాంఛనమేనని తెలుస్తోంది.
కేసీఆర్ ప్లానేంటి!?
అయితే.. కవిత ఎమ్మెల్సీ అవుతారు ఓకే.. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వ్రతా చర్చనీయాంశమైంది. అసలు కేసీఆర్ మనసులో ఏముంది..? గులాబీ బాస్ ప్లానేంటి..? కవితను ఎమ్మెల్సీ చేయడం వెనుక కేసీఆర్ వ్యూహమేంటి..? అనేదానిపై తెలంగాణ ప్రజానికానికి, రాజకీ నేతలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ప్రస్తుతానికి కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన వారంతా దాదాపు అందరూ మంత్రి పదవుల్లో ఉన్నారు. కేసీఆర్ సీఎంగా.. హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా.. కేటీఆర్ పంచాయతీ, మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి కవిత పరిస్థితేంటి..? ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా..? లేకుంటే మంత్రి పదవి ఇస్తారా..? అనేది ఇప్పటి వరకూ తెలియరాలేదు.
శాఖ ఇదేనా!?
వాస్తవానికి ప్రస్తుతం కేసీఆర్‌ను కలుపుకుని మొత్తం 18 మందితో తెలంగాణ కేబినెట్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో కవితను మంత్రిని చేయాలంటే.. ఎవరో ఒకరికి ఒక శాఖ తగ్గించాల్సి వస్తుంది లేదా.. కేబినెట్‌నుంచి ఒకర్ని వదులుకోవాల్సి వస్తుంది. అయితే.. మరీ ముఖ్యంగా నీటి పారుదల శాఖ ఇప్పటి వరకూ ఎవరికీ ఇవ్వలేదు. గత కేబినెట్లో హరీశ్ రావు ఈ శాఖను విజయవంతంగా నడిపించారు. ఈయన హయాంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే తెలంగాణకు సంపాదించిపెట్టారు. అయితే ఇదే శాఖను ప్రస్తుతం కవితకు ఇవ్వాలని మంత్రులు, గులాబీ నేతలు పట్టుబట్టారట. మరి ఫైనల్‌గా కేసీఆర్ ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు..? అసలు పదవి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
కేసీఆర్ ప్లాన్ ఇదేనా!?
వాస్తవానికి కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారని.. కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఢిల్లీ వెళ్తారని ఎప్పట్నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే.. ఇదే జరిగితే కేటీఆర్ సీఎం అవ్వడం.. కవిత రాష్ట్ర వ్యవహారాలను చూసుకోవడంతో పాటు.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక తెలంగాణలో టీఆర్ఎస్ అడ్డే ఉండదు. ఓవైపు కాంగ్రెస్ తలకొరివిగా మారడం.. మరోవైపు బీజేపీ బలపడుతుండటంతో కవిత రంగంలోకి దింపాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి కవితను ఏ పదవి వరిస్తుందో..? అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com