Kavitha:లిక్కర్ కేసులో నిందితురాలిగా కవిత.. అరెస్ట్ తప్పదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును సీబీఐ చేర్చింది. దీంతో 41ఏ కింద ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న ఢిల్లీలో వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు పేర్లు తెరపైకి వచ్చాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం అశోక్ సిసోడియా, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరతచంద్రారెడ్డి తదితర నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో కవిత పేరు కూడా బయటకు వచ్చింది. గతేడాది ఆమెను సాక్షిగా ఈడీ అధికారులు మూడు సార్లు విచారించారు. సుమారు 6 నుంచి 8 గంటల పాటు ఆమెను. ఈ క్రమంలోనే తన దగ్గరున్న ఫొన్లను కూడా అధికారులకు హ్యాండోవర్ చేశారు. అప్పుడే ఆమెను అరెస్ట్ చేస్తారని జోరుగా చర్చ జరగింది. కానీ ఇప్పుడు ఏకంగా సీబీఐనే నిందితురాలిగా గుర్తిస్తూ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈసారి కచ్చితంగా ఆమె అరెస్ట్ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో కేజ్రీవాల్‌ను మరో రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారంటూ ఆప్ మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశముందనే చర్చ ఊపందుకుంది. అయితే సీబీఐ విచారణకు హాజరుకాకూడదని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 28న ఈడీ కేసులో సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున సీబీఐ విచారణకు గైర్హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసిన వేసింది.
అటు ఈ కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవ, శరత్ చంద్రా, కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు కవితను నిందితురాలిగా చేర్చినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో ఓసారి విచారించారు. అప్పుగు 161 కింద నోటీసులు ఇచ్చాం కాబట్టి హైదరాబాద్ వెళ్లి ఆమెను విచారించామని.. ఇప్పుడు నిందితురాలిగా చేర్చి నోటీసులు ఇచ్చినందున స్వయంగా ఆమె విచారణ హాజరుకావాల్సిందేనని అధికారులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవితను నిందితురాలిగా చేర్చి నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఆ పార్టీ ఎలా ముందుకెళ్లనుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout