అభిమన్యుడ్ని కాదురా.. పోలీస్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం 'కవచం'. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంఠినేని నిర్మాతగా శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందింది. డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్. హీరోయిన్‌ని కాపాడే ప్రయత్నంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఆమెకు కవచంలా ఎలా అండగా నిలబడ్డాడనేదే కథ.
"ప్రతి ఆటలోనూ గెలుపొటములుంటాయి. ఓటమి నీ తలరాతా కాదు.. గెలుపు ఇంకొకడి సొత్తూ కాదు. వాటి స్థానం మారడానికి అరసెకను చాలు...
నేను పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదురా.. పోలీస్.
క్రిమినల్ నువ్వు ఆడితే ఎలా ఉంటుందో చూపించావ్.. ఇప్పు పోలీస్ ఆడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను..
ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో పాటు యాక్షన్ పార్ట్ ట్రైలర్‌లో కనపడుతుంది. సినిమా జోనర్ ఏంటో... కథేంటో అని ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్ పడకుండా ఓ క్లారిటీ
ఇచ్చేశాడు దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బెల్లంకొండ ఎంత వరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే డిసెంబర్ 7 వరకు ఆగాల్సిందే.
కాజల్, మెహరీన్ అందచందాలు.. తమన్ సంగీతం, నీల్ నితిన్ ముఖేష్ విలనిజం, ఇవన్నీ సినిమాలో ప్రేక్షకుడిని ఎంత వరకు ఆకట్టుకుంటాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments