బెల్లంకొండ శ్రీనివాస్ కవచం సెన్సార్ పూర్తి.. 'U/A' సర్టిఫికేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ జంటగా నటించిన కవచం చిత్ర సెన్సార్ పూర్తయింది. ఎలాంటి కట్స్ లేకుండా 'U/A' సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబర్ 7న విడుదల కానుంది ఈ చిత్రం. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ కవచంను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు.
ఈ మధ్యే విడుదలైన చిత్ర ట్రైలర్.. ఆడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుంది. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ సొంటినేని(నాని) కవచం సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com