ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. ఒక ప్రమాదాలకు నో ఛాన్స్ ‘‘కవచ్’’ వచ్చేసిందిగా
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నా దేశంలో నిత్యం ఏదో ఒక మూల రైలు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. ఆయా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. అంగవైకల్యం పొందిన వారు ఇంకొందరు. వీటికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటూనే వుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా రైల్వే శాఖ అరుదైన విజయం సాధించింది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు వచ్చినా.. ఢీకొట్టకుండా అందుబాటులోకి తీసుకొచ్చిన ‘‘కవచ్’’ సాంకేతికతను రైల్వే శాఖ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. కవచ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఒకే పట్టాలపై ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా... అవి ఢీ కొట్టుకోవు. అల్లంత దూరాన వుండగానే తమకు తాము బ్రేకులేసుకుని మరీ నిలబడిపోతాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లింగంపల్లి- వికారాబాద్ సెక్షన్‌లో ఈరోజు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠిల సమక్షంలో కవచ్ టెస్ట్ డ్రైవ్ జరిగింది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు రైళ్లలో.. ఒక దానిలో రైల్వే మంత్రి, మరో దానిలో రైల్వే బోర్డు చైర్మన్ ప్రయాణించారు. ఈ రెండు రైళ్లు వాటి మధ్య దూరం 380 మీటర్లు ఉండగానే.. వాటిలో అప్పటికే అమర్చిన కవచ్ వ్యవస్థ అలెర్ట్ అయిపోవడంతో రెండు రైళ్లు వాటికవే బ్రేకులేసుకుని ఆగిపోయాయి.
ఇక మరో టెస్ట్ డ్రైవ్ సందర్భంగా మలుపు ఉన్న చోట పైలట్ అనుమతి లేకుండానే రైలు తన వేగాన్ని తనకు తానే గంటకు 30 కిలో మీటర్లకు తగ్గించేసుకుంది. అలాగే క్రాసింగ్ ఉన్న చోట కూడా రైలు తన వేగాన్ని నియంత్రించుకోవడం విశేషం. మరో టెస్ట్ డ్రైవ్‌లో రెడ్ సిగ్నల్‌ను దాటేసి పోతున్న రైలు తనను తాను నియంత్రించుకుని నిలిచిపోయింది. ఇలా మూడు టెస్ట్‌ల్లోనూ కవచ్ విజయవంతమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout