ఇండియాకు చేరుకున్న కౌశల్ భార్య.. మనోడి సంతోషం చూశారా!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ విజేత కౌశల్ మంద ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ 2లో అతడు ఏకఛత్రాధిపత్యంగా టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇందులో కౌశల్ ఆర్మీ పాత్ర ఎంతైనా ఉంది. కౌశల్ పెర్ఫామెన్స్ మెచ్చిన అభిమానులు కౌశల్ ఆర్మీగా అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు.
ఇదీ చదవండి: ఒక్క అభిమాని దూరమైనా భరించలేను.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్
ఇదిలా ఉండగా కౌశల్ గత కొన్ని రోజులుగా తన భార్య నీలిమ ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉన్నాడు. ఎట్టకేలకు అతడి టెన్షన్ తీరిపోయింది. తాను యుకెలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నానని నీలిమ ఇటీవల తెలిపింది. ఈ క్రమంలో తాను కోవిడ్ కి గురైనట్లు తెలిపింది.
అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని నీలిమ చెప్పడంతో కౌశల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కోలుకోవాలని అభిమానులు ప్రార్థించారు. అక్కడ వైద్యులు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇస్తున్నట్లు ఆమె సెల్ఫీ వీడియో ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే నీలిమ కోవిడ్ పాజిటివ్ గా తేలిన 8 రోజులకే కోలుకున్నారు. నెగటివ్ అని తేలడంతో నేషనల్ హెల్త్ సర్వీస్ నుంచి ఆమెకు ధ్రువీకరణ లభించింది. దీనితో నీలిమ ఇండియాకు చేరుకున్నారు. ఈ సంతోషంలో కౌశల్ సోషల్ మీడియాలో జై పారాసిటమాల్ అని పోస్ట్ పెట్టాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com