ఇండియాకు చేరుకున్న కౌశల్ భార్య.. మనోడి సంతోషం చూశారా!

  • IndiaGlitz, [Monday,June 07 2021]

బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ విజేత కౌశల్ మంద ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ 2లో అతడు ఏకఛత్రాధిపత్యంగా టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇందులో కౌశల్ ఆర్మీ పాత్ర ఎంతైనా ఉంది. కౌశల్ పెర్ఫామెన్స్ మెచ్చిన అభిమానులు కౌశల్ ఆర్మీగా అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు.

ఇదీ చదవండి: ఒక్క అభిమాని దూరమైనా భరించలేను.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్

ఇదిలా ఉండగా కౌశల్ గత కొన్ని రోజులుగా తన భార్య నీలిమ ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉన్నాడు. ఎట్టకేలకు అతడి టెన్షన్ తీరిపోయింది. తాను యుకెలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నానని నీలిమ ఇటీవల తెలిపింది. ఈ క్రమంలో తాను కోవిడ్ కి గురైనట్లు తెలిపింది.

అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని నీలిమ చెప్పడంతో కౌశల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కోలుకోవాలని అభిమానులు ప్రార్థించారు. అక్కడ వైద్యులు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇస్తున్నట్లు ఆమె సెల్ఫీ వీడియో ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే నీలిమ కోవిడ్ పాజిటివ్ గా తేలిన 8 రోజులకే కోలుకున్నారు. నెగటివ్ అని తేలడంతో నేషనల్ హెల్త్ సర్వీస్ నుంచి ఆమెకు ధ్రువీకరణ లభించింది. దీనితో నీలిమ ఇండియాకు చేరుకున్నారు. ఈ సంతోషంలో కౌశల్ సోషల్ మీడియాలో జై పారాసిటమాల్ అని పోస్ట్ పెట్టాడు.

More News

ప్రధాని మోడీ సంచలన నిర్ణయం.. కరోనా వ్యాక్సిన్ ఇక ఉచితం!

కరోనా సెకండ్ వేవ్ దేశంలో కొనసాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఒక్క అభిమాని దూరమైనా భరించలేను.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్

నందమూరి నటసింహం బాలయ్య తన అభిమానులని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అభిమానుల్లో బాలయ్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నటిని కాబట్టి నచ్చకపోయినా చేయాలి.. నిజంగానే ఆ పని చేసిన హీరోయిన్!

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.

'పంచతంత్రం'లో సుభాష్‌గా రాహుల్ విజయ్... అతని పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.

'పీవీ నరసింహారావు' పేరుతో కొత్త జిల్లా.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్?

10 జిల్లాల తెలంగాణాని కేసీఆర్ 33 జిల్లాలుగా మార్చారు. తెలంగాణాలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది.