వెండితెర‌పై కౌశ‌ల్‌...

  • IndiaGlitz, [Tuesday,October 02 2018]

బిగ్‌బాస్ సీజ‌న్ 2లో విన్న‌ర్ కౌశ‌ల్‌... ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ వ‌చ్చిన కౌశ‌ల్‌కు బిగ్‌బాస్ సీజ‌న్ 2లో నెగ్గ‌డం మంచి క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. దీంతో ఇప్పుడు కౌశ‌ల్‌కు సినిమాల నుండి కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ట‌. రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రంలో కౌశ‌ల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కల‌యిక‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కియరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రానికి నిర్మాత‌.