కౌశల్ 'బిగ్‌బాస్' కాదు.. 'బిగ్ బోగస్'.. ఇదిగో ఆధారాలు!

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

నటుడు కౌశల్.. ఈ పేరు బిగ్‌‌బాస్ షోకు ముందు ఎవరికీ పెద్దగా తెలియకపోయిండొచ్చుకానీ.. బిగ్ బాస్‌బాస్-2 నుంచి ఇప్పటి వరకూ ఈ పేరు మార్మోగింది. ఈయన బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన్ను వెన్నంటి నడిపింది కౌశల్ ఆర్మీ.. ఆయన బిగ్‌బాస్ విజేతగా గెలవడంలో ప్రముఖ పాత్రేకాదు కర్మ, కర్మ, క్రియ ఆ ఆర్మీనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ ఆర్మీనే ఇప్పుడు కౌశల్‌‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తోంది. ఫ్యాన్స్‌‌ను ప్రేమించాల్సింది పోయి కౌశల్ వెర్రిపప్పలుగా చూస్తున్నాడని.. కౌశల్ పేరుతో పెట్టిన పౌండేషన్‌ డబ్బు మొత్తం పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకప్పటి కౌశల్ వారియర్స్, ఆర్మీ.. ఇప్పుడు వార్ రివర్స్ చేస్తోంది.

అసలేం జరిగింది.. ఎందుకు రివర్స్ అయ్యింది..!?

బిగ్‌బాస్ షో విజేతగా నిలిచిన అనంతరం ఆయన ఇంటర్వ్యూలు, సన్మాన సభలు, విదేశాల్లో సభలతో డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా వ్యవహారాలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే ఆయనకు చాలా వరకు సొంత ఆర్మీనే వ్యతిరేకత వ్యక్తం చేసింది. అయితే తాజాగా.. కౌశల్‌ను నమ్మొద్దు.. అతనొక మోసగాడు.. కౌశల్‌ చెప్పేదానికీ.. చేసేదానికీ పొంతన వుండదు. అభిమానులతో డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటాడే తప్ప జేబులోంచి రూపాయి బయటకి తీయడు. ఎక్కడికి అతడిని రమ్మన్నా కూడా అందులో నాకేంటి లాభమని చూసుకుంటాడు. ప్రతి చిన్న ఈవెంట్‌కి కూడా డబ్బులు ఆశిస్తున్నాడు అని కౌశల్‌పై సోషల్ మీడియా వేదికగా కొందరు ఆయన ఆర్మీలోని అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. కౌశల్ ఇలా చేస్తుండటంతో ఆయనకు ఆదరించిన.. అభిమానించిన వాళ్లంతా ఇప్పుడు రివర్స్ అయ్యారు. ఆయన బాగోతాన్ని బయటపెట్టేందుకు టీవీ చానెల్స్ మెట్లెక్కుతున్నారు.

బిగ్‌బాస్ కాదు బిగ్ బోగస్..

బిగ్‌బాస్ షోల్ విజేత అయినప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ పౌండేషన్ పెట్టి క్యాన్సర్‌ రోగులకు ఖర్చుపెడతానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందంటారు కదా ఇప్పుడే సేమ్ టూ సేమ్ జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు బయటకూడా అన్నీ ఫ్రాడ్స్ చేస్తున్నాడని ఆయన బిగ్‌బాస్ కాదు ‘బిగ్ బోగస్’ అని ఆయన ఆర్మీ కన్నెర్రజేస్తోంది. కౌశల్ ఆర్మీ పేరుతో తమతో లక్షలాది రూపాయిలు ఖర్చుపెట్టించి ఇప్పుడు తమను నట్టేట ముంచుతున్నారని ఆర్మీ సభ్యులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయనకోసం ఒకప్పుడు క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ పేజీలను పూర్తిగా స్వాధీనం చేసుకొని వాటికి అడ్మిన్‌‌లుగా ఉన్నవారిని పక్కకునెట్టేసినట్లు ఆర్మీ వ్యవస్థాపకులు అయిన ఇమామ్, శేషు, హరి ఆరోపిస్తున్నారు.

కౌశల్‌‌కు ఇవన్నీ పట్టవా..!?

ఓ ప్రముఖ టీవీ చానెల్‌ డిబెట్‌‌లో ఆర్మీ గ్రూప్ సభ్యులు చేస్తు్న్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు మాట్లాడే మాటలను బట్టి చూస్తే వాళ్లు ఎంత ఇబ్బంది పడ్డారో అర్థం చేస్కోవచ్చు. వాళ్లు చెబుతున్న ఒక్కో విషయాన్ని బట్టి చూస్తే అసలు కౌశల్ ఇలాంటోడా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఒక్కో అభిమాని చెబుతున్న మాటలు వింటుంటే వామ్మో.. కౌశల్‌‌ను గెలిపించడానికి ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. ముఖ్యంగా ‘నేనింతే’ సినిమాలో హీరో కోసం సచ్చిపోయే అభిమానుంటాడు కదా ఆ రేంజ్‌‌లో కౌశల్‌‌ను అభిమానించినోళ్లు ఉన్నారంటే అర్థం చేస్కోవచ్చు. మరీ ముఖ్యంగా ఓ బిజినెస్‌మెన్ తన వ్యాపారం మొత్తం పోయి.. ఆఖరికి పెళ్లాం మెడలోని నగలు కూడా అమ్మేసే స్థితికి వచ్చారని బాధితులు డిబెట్‌లో చెబుతున్నారు.. అంటే పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి.. అలాంటి వారందర్నీ కౌశల్ ఎలా మోసం చేశారో.. ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక.

కౌశల్ రియాక్షన్ ఇదీ..

ఇలా ప్రతీసారి నాపై ఆరోపణలు చేయడం అలవాటైంది. అయినా ప్రతీ దానికి సమాధానం చెప్పుకుంటూ పోవడం నాకేం అవసరం లేదు. ప్రతీ ఆరోపణపై స్పందించేంత సమయం కూడా నా దగ్గర్లేదు. కావాలనే నన్ను కించపరచాలని ఇదంతా చేస్తున్నారు. కాలమే వీటన్నంటికి సమాధానం చెబుతుంది.. కొన్ని రోజులు ఆగితే నిజానిజాలేంటో అవే బయటకు వస్తాయి అని కౌశల్ చెబుతున్నాడు. అయితే ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్తుంది..? ఈ వివాదానికి ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందనే విషయం మున్ముంథు తేలుందన్న మాట.

More News

అఖిల్‌తో టాక్సీవాలా హీరోయిన్‌?

తొలి చిత్రం టాక్సీవాలా అనుహ్య విజ‌యంతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే..

సుమన్‌ ముఖ్య అతిథిగా 'దుర్మార్గుడు' ఆడియో విడుదల

బేబీ ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్‌ బ్యానేర్‌పై రాజవంశీ నిర్మించిన చిత్రం 'దుర్మార్గుడు'. విజయ్‌ కృష్ణ , ఫిర్దోస్‌ భాను హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సునీల్‌ జంపా దర్శకత్వం

భారత్‌ పై కన్నెత్తి చూడాలంటే భయపడేలా బుద్ది చెప్తాం..

మనదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడేలా బుద్ధి చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. భారత్ ఎప్పుడూ ఎవరికి భయపడదన్నారు.

మెరుపు దాడులు : భారత మాత తల దించనివ్వను

ఉగ్రమూకలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడిచేసి మంగళవారం తెల్లవారు జామున కేవలం 22 నిమిషాల్లో మూడు స్థావరాలను ధ్వంసం చేసి మొత్తం 300కిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

సర్జికల్ స్ట్రైక్స్‌‌కు స్కెచ్ వేసింది ఈయనే...

ఉగ్రమూకలపై భారతసైన్యం 2016, 2019లో ఇలా రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అయితే ఈ స్ట్రైక్స్‌‌కు సంబంధించి స్కెచ్ వేసిందెవరు..?