నేను పవన్‌ను ఏమన్లేదు..కౌశల్ వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొద్దిరోజులుగా అటు టీవీ చానెల్స్.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్‌పై బిగ్‌బాస్-2 విజేత కౌశల్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన తనపై వస్తున్న పుకార్లు, తానేమీ చేయకున్నా చేశానని చెబుతున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చుకున్నాడు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను ఏదో తిట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ కింది విధంగా వివరించాడు.
పవన్ వివాదంపై క్లారిటీ..
తాను పవన్‌ను ఏదో అన్నానని.. కొందరు ఆయన అభిమానులను రెచ్చగొట్టి ఇష్టానుసారం చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో ఆయన స్టైల్‌తోనే నెగ్గగలిగానన్నాడు. పవన్‌కు తాను వీరాభిమానిని ఏ చిన్నమాట కూడా ఆయనను అనలేదన్నారు. ముఖ్యంగా తన బిగ్‌బాస్ విజయంలో పవన్, మహేశ్ ఫ్యాన్స్ ఉన్నారని అప్పుడూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నానని ఆయన అన్నారు. తాను పవన్‌పై చేసిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు చూపించండన్నారు. ఈ సందర్భంగా జనసేన అధికార ప్రతినిధి అయిన కల్యాణ్ దిలీప్ సుంకర ఈ వివాదంపై చేసిన పోస్ట్‌ను మీడియాకు కౌశల్ చదివి వినిపించాడు. అయితే తాను ఎదుగుతుంటే చూడలేని కొందరూ తనపై అనవసరంగా కుట్రలు పన్నుతున్నారని వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి తనకుందని కౌశలు చెప్పుకొచ్చాడు.
మొత్తం లెక్కలున్నాయ్..
"మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించిన అన్ని వివరాలు అన్నీ కచ్చితంగానే ఉన్నాయి. ప్రతీ రూపాయికి లెక్క ఉంది. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చు. నేను డబ్బు మనిషిని కానే కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞడుని. బిగ్‌బాస్ గేమ్‌ను నేను ఎంతో కష్టపడి గెలిచాను. ఆర్మీ తరపున చేసే ప్రతీ కార్యక్రమం రికార్డెడ్. అన్ని వివరాలు ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. నా కుటుంబాన్ని కూడా వదిలి కౌశల్ ఆర్మీ కోసం పనిచేస్తున్నా. నా పై ట్రోలింగ్ చేస్తున్న ఆరుగురిపై సైబర్ క్రైమ్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేశాను" అని కౌశల్ స్పష్టం చేశాడు.
ప్రైజ్ మనీ రూ. 34 లక్షలు మాత్రమే..
"నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండి సంపాదించిన ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు దుర్వినియోగం చేయలేదు. అలా తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమే. నాకు ఫ్రైజ్ మనీగా వచ్చిన రూ. 50 లక్షలు క్యాన్సర్ రోగుల కోసం ఖర్చు చేస్తానని ప్రామిస్ చేశా.. నా వంతుగా నేను సాయం చేస్తూ వస్తున్నాను. నా కన్న తల్లి పేదరికంతో సరైన వైద్యం లేకపోవడం వల్ల క్యాన్యర్‌తో చనిపోయింది.. అందుకే నా తల్లిలా మరొకరికి కాకూడదని నా ఫ్రైజ్ మనీ క్యాన్సర్ పేషెంట్ల కోసం డొనేట్ చేశాను. అయితే నాకు అన్ని టాక్స్ పోనూ చేతికి వచ్చింది రూ. 34 లక్షలు మాత్రమే" అని తనను అనుమానిస్తున్న వారికి కౌశల్ వివరణ ఇచ్చాడు.
నా భార్యకు కూడా క్యాన్సర్..
నా తల్లిలా నా భార్యకు కూడా క్యాన్సర్ ఉంది. కడుపులో కంతి పెట్టుకుని నా కోసం కష్టపడుతుంది. ఆమెపై కూడా ఆరోపణలు చేస్తున్నారు.. ఇది నాకు చాలా బాధ కలిగించింది. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే నా భార్య నీలిమి నాకోసం ఎంతో కష్టపడింది. తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. నా తల్లి కోరికను తీర్చిడం కోసం నేను హీరోగా సినిమా చేయాలని నా భార్య ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది" అని కౌశల్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి చూస్తే కౌశల్ చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పేశాడు.. అయితే ఆయన ఆర్మీ ఏం చేయబోతోంది.. మళ్లీ మీడియా మీట్లు, డిబెట్లతో హడావుడి చేస్తుందా లేకుంటే ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెడుతుందా అనేది వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments