సంచలన రికార్డ్ అందుకున్న 'కాటుక కనులే' సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆకాశం నీ హద్దురా చిత్రం సూర్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇది కమర్షియల్ మూవీ కాదు. కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
ఐఎండిబి రేటింగ్ లో ప్రపంచంలోనే టాప్ 3 ఫిలిం గా రికార్డు సృష్టించింది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర ఖాతాలో మరో రికార్డ్ పడింది. తెలుగులో ఈ చిత్రాన్ని ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రంలోని 'కాటుక కనులే' అనే సాంగ్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది.
సూర్య, అపర్ణ బాల మురళి మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ప్రతి చోటా వినిపించేది. అందుకు కారణం జివి ప్రకాష్ సంగీతం ఒకెత్తయితే.. దీక్షిత గాత్రం, భాస్కరభట్ల లిరిక్స్ మరో ఎత్తు. భాస్కర బట్ల సరళమైన భాషల్లో వినసొంపైన లిరిక్స్ అందించారు. ఈ పాటలో భాస్కర బట్ల వినగానే గుర్తుండిపోయే పదాలు వాడారు.
ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. తమిళంలో ఇదే సాంగ్ కు కేవలం 63 మిలియన్ వ్యూస్ మాత్రమే దక్కాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. భాస్కరభట్ల తన లిరిక్స్ తో ఈ సాంగ్ కి ఎంత వైట్ తీసుకువచ్చారో అని.
ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఎత్తరుక్కుమ్ తునిందవన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com