కత్తిలాంటోడు..ఇదా చిరు టైటిల్..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి హడావిడి అయిపోయింది కాబట్టి ఇక నుంచి చిరు ఫోకస్ అంతా 150వ సినిమా పైనే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి వినాయక్ దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాత.
అంతా బాగానే ఉంది కానీ...కొత్తగా తెరపైకి వచ్చిన కత్తిలాంటోడు టైటిలే కొంత మంది అభిమానులను కలవరపెడుతోంది. చిరు 150వ సినిమా టైటిల్ అంటే...ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్...ఈ రేంజ్ లో ఉండాలి. కానీ..దమ్మున్నోడు, స్పీడున్నోడు, సరైనోడు...ఇలా కత్తిలాంటోడు ఏమిటి..? అని ప్రశ్నిస్తున్నారు. మరి...చిరు ఆలోచించి టైటిల్ మారుస్తారో..? కత్తిలాంటోడు టైటిల్ కన్ ఫర్మ్ చేస్తారో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com