మంచు లక్ష్మీ రోల్ ను అక్కడకత్రినా చేస్తుందట...
Send us your feedback to audioarticles@vaarta.com
లక్ష్మీ మంచు, అడవిశేష్ ప్రధాన పాత్రల్లో మంచు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం దొంగాట`. లక్ష్మీ మంచు నిర్మించిన ఈ చితానికి వంశీ కృష్ణ దర్శకుడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ వెర్షన్ లో లక్ష్మీ మంచు పాత్రను కత్రినా కైఫ్ చేస్తుందట. ముందు ఈ పాత్రకు బిపాసాబసుని అనుకున్నారట. అయితే డేట్స్ అడ్జస్ట్ మెంట్ లో సమస్య రావడంతో నిర్మాతలు కత్రినా కైఫ్ ను సంప్రదించారట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుగు సినిమాని డైరెక్ట్ చేసిన వంశీకృష్ణ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com