'సూర్యవంశీ' తో కత్రినా
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాలు మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. ఆయన రూపొందించే సినిమాలన్నీ మాస్ మసాలాతో పక్కా కమర్షియల్‌గా ఉంటాయి. రోహిత్ తాజాగా అక్షయ్‌కుమార్ హీరోగా రూపొందిస్తున్న సినిమా ‘సూర్యవంశీ’. ఈ సినిమాలో అక్షయ్ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ చీఫ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ సరసన కత్రినా కైఫ్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ‘వెల్కమ్ కత్రినా..’ అంటూ చిత్ర యూనిట్ ‘సూర్యవంశీ’ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించింది. 2020 మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించే తొలి సినిమా ఇదే కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments