సల్మాన్‌ను పెళ్లి చేసుకోమంటే కత్రినా ఏమందో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పెళ్లి గురించి ఏదో రకంగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఐశ్వర్యరాయ్ తర్వాత కత్రినాకైఫ్లతో ప్రేమాయణం జరిపిన సల్మాన్ తర్వాత ఏ హీరోయిన్‌తో ప్రేమలో లేడు. ఐశ్వర్యరాయ్.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది.
కత్రినా సల్మాన్ తర్వాత రణభీర్‌కపూర్‌తో ప్రేమలో ఉండి.. ఇద్దరు విడిపోయారు. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సల్మాన్, కత్రినాలు స్నేహితులుగా ఉన్నారు. సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు భారత్ సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.
రీసెంట్గా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కత్రినాను ఓ అభిమాని సల్మాన్‌ను పెళ్లిచేసుకోండి ప్లీజ్ అని అడిడితే.. హుస్సో అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి..పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తులు, రెండు మనసులకు సంబంధించింది. అలాంటి వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని సమాధానం ఇచ్చింది కత్రినా!.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments