సల్మాన్‌తో మరోసారి కత్రినా!
Send us your feedback to audioarticles@vaarta.com
కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో బిజీ అయ్యాడు. సల్మాన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'భరత్'. సల్మాన్ ఖాన్ సరసన ప్రియాంక చోప్రా, దిశా పటాని హీరోయిన్స్‌గా నటించాల్సి ఉంది. కానీ ఎంగేజ్‌మెంట్ కారణంగా సినిమా నుండి ప్రియాంక తప్పుకుంది. దీంతో యూనిట్ కాస్త అప్‌సెట్ అయింది.
ఇప్పుడు మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కత్రినాకైఫ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. అలీజాఫర్ దర్శకత్వంలో సినిమా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. ఈ సినిమా 1960 బ్యాక్‌డ్రాప్ నుండి ఇప్పటి వరకు జరిగే ఓ కథాంశంతో తెరకెక్కనుంది. ఇందులో సల్మాన్ ఖాన్ స్టంట్ మన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 సినిమా కూడా చేయబోతున్నాడు సల్మాన్‌ఖాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com