మీ నోటీసులకు భయపడం, కోర్టులోనే తేల్చుకుంటాం .. హీరో ధనుష్‌కి కదిరేశన్ దంపతుల సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో ధనుష్ తల్లిదండ్రులం తామేనంటూ మధురైకి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు గత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ.. ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది.
ధనుష్ తమ కుమారుడని, చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చాడంటూ కదిరేషన్, మీనాక్షి దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి వారు కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ న్యాయస్థానంలో వారికి చుక్కెదురైంది. మరోవైపు కదిరేషన్ దంపతుల వ్యవహారంతో విసిగిసోయిన ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా.. వారిద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. తమ పేరుప్రతిష్టలకు భంగం కలిగించే చర్యలకు స్వస్తి పలకాలని... గత నాలుగేళ్లుగా చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతూ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో పదికోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అయితే ఈ నోటీసుకు కదిరేశన్ దంపతులు ధీటుగానే బదులిచ్చారు. ధనుష్ పంపిన నోటీసులను చట్టపరంగా ఎదుర్కొంటామని కదిరేశన్ సవాల్ విసిరారు. నోటీసులకు తాము భయపడమని , చట్టపరంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ధనుష్‌కి తిరిగి నోటీసులు పంపించారు కథిరేశన్. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com