చిరు కుమార్తెను టార్గెట్ చేసిన కత్తి.. షాకింగ్ కామెంట్స్!

  • IndiaGlitz, [Tuesday,September 24 2019]

టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. వివాదాలే నా ఊపిరి.. సర్వస్వం అంటూ రోజుకు రెండు ట్వీట్లు.. వీలైతే ఇంకొకటి వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్ట్ చేసి గడిపేసే కత్తి.. ఈసారి మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఇంతవరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అటు రాజకీయ పరంగా.. ఇటు సినిమాల పరంగా విమర్శలు గుప్పించే ఈయన.. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితను టార్గెట్ చేయడం గమనార్హం.

అందరూ ప్రశంసలు.. ఈయనొక్కడే!
చిరు పెద్ద కుమార్తె కాస్ట్యూమ్ డిజైనర్ అనే విషయం అందరికీ తెలిసిందే. మెగా హీరోలు సినిమాలు మొదలుకుని ఈమె దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాకు కాస్ట్యూమ్స్ దగ్గరుండి చూసుకునేది. అంతేకాదు.. సైరా లాంటి భారీ బడ్జెట్ సినిమాకు సైతం సుస్మితే మొత్తం టాప్ టూ బాటమ్ అందరు నటీనటులకు కాస్టూమ్స్ చూసుకుంది. వాస్తవానికి సుస్మిత తెలివితేటలకు సైరాలో నటించిన పెద్ద పెద్ద నటులే ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత సాహసం చేస్తున్న మెగా డాటర్‌ను మెచ్చుకోవాల్సింది పోయి.. కత్తి మహేశ్ మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచాడు.

సుస్మిత ఒక్కటే కాదు..!
అంతేకాదు.. తాను పడ్డ కష్టం గురించి సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా మెగా డాటర్ అనుభవాలను పంచుకుంది. అయితే సుస్మిత చెప్పేదంతా తూచ్.. ఆమె వెనుక ఉన్న మరో అమ్మాయి ఇదంతా చేస్తోందని.. పేరు మాత్రం ఈమెకు వస్తోందని కత్తి చెప్పుకొచ్చాడు. అందుకే తెరవెనుక ఉన్న ఆమె గురించి కూడా మాట్లాడాలని కేవలం సుస్మిత గురించే మాట్లాడటం అస్సలు పద్ధతి కాదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్లుగా కత్తి సెటైర్ల వర్షం కురిపించాడు. ఈ పోస్ట్‌పై మెగాభిమానులు, నెటిజన్లు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కత్తి వ్యాఖ్యలపై మెగా కంపౌండ్ నుంచి రిప్లై వస్తుందో లేదో వేచి చూడాలి మరి.

More News

అమృతకు వార్నింగ్.. ఇంకెన్నాళ్లిలా.. ఎందుకిలా..!?

పెరుమాళ్ల ప్రణయ్ ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. నల్గొండలో జరిగిన కుల దురహంకారానికి ప్రణయ్ బలయ్యాడు.!

దేశ భవిష్యత్తు కోసం చేసే పోరాటమే 'దాడి'

సమాజంలోనే కాక దేశ యావత్తు జరిగే, జరిపే దాడుల వెనుకున్నకుట్రలనుఅదుపుచేసే ప్రయత్నమే మా ఈ  'దాడి'.

అక్టోబర్‌లో అధర్వ హీరోగా నటించిన ‘బూమరాంగ్‌’

తమిళంలో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు.

ఎస్.. రీ ఎంట్రీ ఇస్తున్నా.. : సీనియర్ నటి లైలా

లైలా.. ఈ సీనియర్ నటి గురించి టాలీవుడ్ ప్రియులకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

పోలవరం: కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి!

పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన తర్వాత మరోసారి టీడీపీ-వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది.