అలా మొదలైన కత్తి మహేష్ ప్రయాణం.. ఎన్నో వివాదాలు, మలుపులు
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. కత్తి మహేష్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేవారు. తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడే వారు. కొన్ని సార్లు తన వ్యాఖ్యలు వివాదంగా మారినా వెనకడుగు వేసేవారు కాదు. విషయం పరిజ్ఞానం, ప్రతిభ కల్గిన కత్తి మహేష్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి.
దర్శకుడిగా, రచయితగా
కత్తి మహేష్ దర్శకుడిగానూ, రచయితగానూ తన ప్రతిభ చాటుకున్నారు. కత్తి మహేష్ 'మిణుగురులు' చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. అలాగే 2015లో పెసరట్టు అనే చిత్రాన్ని దర్శకుడిగా మారి తెరకెక్కించారు. అలా కత్తి మహేష్ సినిమా మేకింగ్ లో ప్రావీణ్యం పొందారు.
ఫిలిం క్రిటిక్ గా
ఇక తనకు బాగా ఇష్టమైన వర్క్ సినిమా విశ్లేషణలపై ఫోకస్ పెట్టారు. కాటమరాయుడు చిత్ర రివ్యూ విషయంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య వార్ నడిచింది. అయితే కత్తి మహేష్ తన భావాలని సూటిగా చెప్పడానికే ఇష్టపడ్డారు. పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
రాజకీయ విమర్శలు
ఆ తర్వాత కత్తి మహేష్ పవన్ ని రాజకీయంగా కూడా విభేదిస్తూ వచ్చారు. పవన్ అపి టివి షోలలో కత్తి మహేష్ చేసిన పొలిటికల్ కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. అయితే ఏ సందర్భంలో కూడా కత్తి మహేష్ వెనకడుగు వేయలేదు. పవన్ ని పొలిటికల్ గా విమర్శిస్తూనే వచ్చారు. ఇలా కత్తి మహేష్ కు మీడియాలో కూడా క్రేజ్ పెరిగింది.
వరుస వివాదాలు
కొన్ని సందర్భాల్లో కత్తి మహేష్ వ్యాఖ్యలు సెన్సిటివ్ గా ఉండడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. అయినప్పటికీ కత్తి మహేష్ తాను నమ్ముకున్న సిద్ధాంతాన్నే గట్టిగా వినిపించేవారు.
నటుడిగా
కత్తి మహేష్ బిగ్ బాస్ తొలి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇటీవల కత్తి మహేష్ పలు చిత్రాల్లో కూడా నటించారు. ఆర్జీవీ తెరకెక్కించిన పవర్ స్టార్ చిత్రంలో కత్తి మహేష్ నటించారు. ఇటీవల రవితేజ సూపర్ హిట్ మూవీ 'క్రాక్' లో కూడా కత్తి మహేష్ మెరిశారు.
తనలోని విభిన్నమైన కోణాలని ఆవిష్కరిస్తూ వచ్చిన కత్తి మహేష్ ఎవ్వరితోను వ్యక్తిగత వైరం పెట్టుకోలేదు. కేవలం సిద్ధాంత పరంగానే విభేదిస్తూ వచ్చారని, ఆయన గొప్ప మానవతా వాది అని కత్తి మహేష్ సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా కత్తి మహేష్ మృతి ఆయన కుటుంబ సభ్యుల్లో, సన్నిహితుల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments