డ్యామేజ్ అయిన ఎడమ కన్ను.. కత్తి మహేష్ కోసం ఫండ్ రైజింగ్
- IndiaGlitz, [Monday,June 28 2021]
నటుడు, ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ శనివారం ఉదయం కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. నెల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వెంటనే నెల్లూరులోని మెడికేర్ ఆసుపత్రికి కత్తి మహేష్ ని తరలించారు.
ఇదీ చదవండి: భర్తతో కాజల్ లాంగ్ డ్రైవ్.. ప్లానింగ్ లేకుండా కారెక్కారు!
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. అయితే తాజాగా సమాచారం మేరకు కత్తి మహేష్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డట్లు తెలుస్తోంది. కానీ దురదృష్టవశాత్తు కత్తి మహేష్ ఎడమకన్ను పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ప్రాణాపాయం లేదు కానీ.. వైద్యులు కత్తి మహేష్ కు కీలకమైన సర్జరీలు చేబోతున్నారట. నేడు వైద్యులు కత్తి మహేష్ కి కార్నియోఫేసియల్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ తర్వాత కత్తి మహేష్ ఆరోగ్యపరిస్థితిపై పూర్తి క్లారిటీ రానుంది.
తలకు బలమైన గాయం తగిలింది. కానీ మెదడులో రక్తం గడ్డకట్టకపోవడంతో కత్తి మహేష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా కత్తి మహేష్ వైద్యం కోసం భారీగా డబ్బు ఖర్చు కానుంది. మూడు వారాల పాటు కత్తి మహేష్ ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందట. ప్రస్తుతం కత్తి మహేష్ కుటుంబ సభ్యులు, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఖర్చులకు డబ్బు సరిపోయింది.
ఇకపై అతడి వైద్యం ఖర్చు, విశ్రాంతి, రీహాబిలిటేషన్ కోసం సన్నిహితులు కొందరు ఫండ్ రైజింగ్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ట్రస్ట్ ద్వారా ఈ ఫండ్ రైజింగ్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.