ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇనోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో చంద్రశేఖర పురం వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అయితే కత్తి మహేష్ కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే కత్తి మహేష్ ని నెల్లూరులోని మెడికేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు కొంతభాగం ద్వంసం అయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం అనంతరం 108 సహాయంతో కత్తి మహేష్ ని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
కత్తి మహేష్ ఫిలిం క్రిటిక్ గా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం నటుడిగా చిన్న చిన్న అవకాశాలు అందుకుంటున్నారు. ఈ ఏడాది విడుదలైన క్రాక్ మూవీలో కత్తి మహేష్ ఓ రోల్ నటించిన సంగతి తెలిసిందే.
సినిమా, రాజకీయ పరమైన అంశాలతో కత్తి మహేష్ తన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. టివి చర్చా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారడం చూస్తూనే ఉన్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com