విజ‌య్ సేతుప‌తి పై క‌త్తి మ‌హేశ్ కామెంట్స్‌

  • IndiaGlitz, [Friday,October 19 2018]

టాలీవుడ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేసి త‌న‌కు ప్ర‌శ్నించే హ‌క్కు ఉంద‌ని అంటూ వచ్చిన క‌త్తి మ‌హేశ్‌ను కొన్ని రోజులు హైద‌రాబాద్ నుండి బ‌హిష్క‌రించారు. ఈ సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు క‌త్తి మ‌హేశ్ క‌న్ను త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తిపై ప‌డింది.

విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన '96' అక్టోబ‌ర్ 4న విడుద‌లైన ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాలో విజ‌య్‌, త్రిష‌ల న‌ట‌న‌ను అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా గురించి క‌త్తి మ‌హేశ్ సోష‌ల్ మీడియాల కామెంట్స్ చేయ‌డం కొస మెరుపు.

క‌త్తి మ‌హేశ్ త‌న ఫేస్ బుక్ పేజీలో నమ్మిన స్క్రిప్టు కోసం ఒక హీరో ఏమి చేయగలడు అనడానికి విజయ్ సేతుపతి ని మించిన ఉదాహరణ ఉంటుందా అనిపిస్తుంది. 96 సినిమా స్క్రిప్టు విన్నాక. రచయిత,సినిమాటోగ్రఫర్ అయిన ప్రేమ్ కుమార్ ని. కథ చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టు మరొకరు తియ్యలేరు.

కాబట్టి నువ్వే డైరెక్టర్ గా ఉండు. అని ఒకర్ని దర్శకుడిని చేయగలడు. నిర్మాతకు చెప్పి ఒప్పించగలడు. రెండు సంవత్సరాల పాటు సినిమా కొనసాగినా కమిటెడ్ గా షూటింగ్ చేయగలడు. తన మార్కెట్ వాల్యూ 5 నుంచి 7 కోట్ల మధ్య ఉన్నా, సినిమా కోసం కేవలం 3 కోట్ల రెమ్యునరేషన్ తో సరిపెట్టుకోగలడు.

రిలీజ్ చేయడానికి నిర్మాతకు ఫైనాన్సర్లు అడ్డు తగులుతుంటే 4 కోట్ల (తన రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ)కు ష్యురిటీ సంతకం పెట్టి సినిమాను రిలీజ్ చేయగలడు. ఇంత కమిట్మెంట్ ఉందికాబట్టే, అంత గౌరవం సంపాదించుకున్నాడు. ఎదురుగా పొగిడి పక్కకెళ్లి తిట్టుకునే గౌరవం కాదు. నిజంగా నిజమైన గౌరవం. Respect to Vijay Sethupati అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు.