మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వం లో నారా రోహిత్ 'కథలో రాజకుమారి' పాటల రికార్డింగ్!

  • IndiaGlitz, [Monday,January 04 2016]

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ.. ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం 'కథలో రాజకుమారి' చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర పాటల రికార్డింగ్ మాస్ట్రో ఇళయరాజా నేతృత్వం లో చెన్నై లో జరుపుకుంటోంది. కార్తికేయ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన మాగ్నస్ సినీప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చెన్నై లో పాటల రికార్డింగ్ కార్యక్రమం లో పాల్గొన్న నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. "కార్తికేయ లాంటి సూపర్ హిట్ తరువాత మళ్ళీ అంతకుమించిన సక్సెస్ ఫుల్ చిత్రం నిర్మించాలనే ఆలోచనతో ఓ నవ్యమైన కథతో ఈ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మా అద్రుష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ చిత్ర పాటల రికార్డింగ్ ఆయన నేతృత్వం లో చెన్నై లో జరుపుతున్నాం. ఆల్రెడీ మూడు పాటలు రికార్డింగ్ పూర్తి చేశాం. నూతన సంవత్సరం ప్రారంభం రోజున, జనవరి 1న ఈ చిత్ర పాటల రికార్డింగ్ ప్రారంభం కావడం, 2016 లో ఇళయరాజా గారి మొదటి చిత్రంగా మా చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభం కావడం ఆనందం గా వుంది. ఈ పాటల రికార్డింగ్ కార్యక్రమం లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తో పాటు చిత్ర దర్శకుడు మహేష్ సూరపనేని పాల్గొన్నారు. తప్పకుండా ఈ చిత్రం సంగీత పరంగా బిగ్ సక్సెస్ సాదిస్తుందనే నమ్మకం వుంది. నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించనుంది.." అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: జయేష్ నాయర్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: సాహి సురేష్, సహా నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవ సాయి సత్యనారాయణ, సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం.

More News

అమితాబ్ ను రజనీ వద్దన్నాడట...

రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం '2.0' సీక్వెల్ ఆఫ్ రోబో.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది.

రజనీకాంత్ రిలీజ్ డేట్ మారింది...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను మహదేవ్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

మ‌హేష్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్...ఎక్కువుగా మాట్లాడ‌రు..ఎక్కువ మందితో క‌ల‌వ‌రు. మీడియాతో అస‌లు క‌ల‌వ‌రు..మాట్లాడ‌రు.. అలాంటి మ‌హేష్ లో చాలా మార్పు వ‌చ్చింది.

ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ నేను..శైలజ - సక్సెస్ మీట్ స్రవంతి రవి కిషోర్

రామ్,కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం నేను..శైలజ.ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు.

సోగ్గాడు..సంక్రాంతికి రావ‌డం ఖాయం

కింగ్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ క్రిష్ణ తెర‌కెక్కించారు.