కథలో రాజకుమారి సెన్సార్ పూర్తి, ఆగష్టు 25 విడుదల

  • IndiaGlitz, [Wednesday,July 26 2017]

నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం "కధలో రాజకుమారి". రాజేష్ వర్మ సిరువూరి సమర్పణ లో నిర్మించబడిన ఈ చిత్రానికి సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్, నిర్మాతలు ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ "యు" సర్టిఫికేట్ అందుకొంది. సెన్సార్ సభ్యుల నుండి విశేష స్పందనను పొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన "కథలో రాజకుమారి"ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి" అన్నారు.
నాగశౌర్య, నమిత ప్రమోద్, నందిత, శ్రీముఖి, శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల, అజయ్, ప్రభాస్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, కమెడియన్ సత్య, జెన్ని హని తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా- విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం: నరేష్ కే రానా, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్!

More News

ఇక సినిమాలు చాలు అని అనుకున్నప్పుడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తా - సాయిపల్లవి

వరుణ్తేజ్,సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం `ఫిదా`. జూలై 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తెలంగాణ అమ్మాయి భానుమతి పాత్రలో సాయిపల్లవి నటన అందరినీ అలరిస్తుంది.

గ్రీన్ కార్డ్ కావాలంటే ఆగస్ట్ 4 వరకు ఆగాల్సిందే

మన వారసులు అమెరికాలో స్థిరపడాలని, బాగా డబ్బులు సంపాదించాలని మనం కోరుకుంటాం. కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా అమెరికా వెళ్లే మనవారు అక్కడేలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారనే కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం `గ్రీన్ కార్డ్`.

ఆర్భాటంగా 'గల్ఫ్' పాటల విడుదల

చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే, సంతోష్ పవన్ లు నటించిన గల్ఫ్ ఆగస్టు లో విడుదలకి సిద్ధం అవుతోంది. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిత్రసీమలో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం తెలిసినదే.

అగష్టు మూడవ వారంలో 'ఉంగరాల రాంబాబు' విడుదల

సునీల్ హీరోగా,మియాజార్జ్ జంటగా,క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విడుదలకి సిధ్ధమైన చిత్రం ఉంగరాల రాంబాబు.

మా 'సినిమావాళ్ళవి' అద్దాలమేడ జీవితాలు.. - వై వి ఎస్ చౌదరి.

మేము అడుక్కున్నా అతిశయమే,అడుక్కోకున్నా అతిశయమే,