Katha Venuka Katha:‘కథ వెనుక కథ’.. మార్చి 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యానర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేస్తున్నారు. ఇది వరకే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
డైరెక్టర్ కావాలనుకునే ఓ యువకుడు (విశ్వనాథ్) ఓ కథను సిద్ధం చేసుకుంటాడు. సిటీలో అమ్మాయిలు కనిపించకపోవటంపై ఓ కథను తను రెడీ చేసుకుంటాడు. అయితే నిజంగానే సిటీలో అమ్మాయిలు కనిపించకుండా పోవటమే కాదు.. హత్యకు కూడా గురవుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయటానికి ఓ పోలీస్ ఆఫీసర్ (సునీల్) వస్తాడు. తను అనుమానాస్పదంగా ఉంటూ డైరెక్టర్ కావాలనుకునే యువకుడిని అరెస్ట్ చేస్తాడు. అసలు అమ్మాయిలు సిటీలో కనిపించకుండా పోవటానికి కారణం ఎవరు? ఆ క్రైమ్ వెనుకున్న గ్యాంగ్ ఏది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నిర్మాత దందమూడి అవనీంద్ర కుమార్ ‘కథ వెనుక కథ’ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. సినిమాలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
నటీనటులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ, సునీల్, జయ ప్రకాష్, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, ఈరోజుల్లో సాయి, రూప తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com