Katha Venuka Katha:మే 12న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యానర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా నటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అవనీంద్ర కుమార్ నిర్మించారు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘‘కథ వెనుక కథ’ సినిమాను మే 12న విడుదల చేస్తున్నాం. మా సాయి సినిమాను ముందుండి నడిపించారు. సినిమా చాలా బాగా వచ్చింది. సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. సునీల్‌గారు, హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ సహా నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు అయ్యాయి. 80కిపైగా సినిమాలు చేశాను.మా నిర్మాతగారు జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్యాషన్‌తో అన్ కాంప్రమైజ్డ్గా, మంచి కంటెంట్‌తో చేసిన సినిమా తప్పకుండా మే 12న వస్తోన్న కథ వెనుక కథ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను’’ అన్నారు.
నటీనటులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ, సునీల్, జయ ప్రకాష్, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, ఈరోజుల్లో సాయి, రూప తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com