రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ‘కథ మొదలైంది’

  • IndiaGlitz, [Saturday,December 05 2020]

దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’ పేరుతో సినిమా మొదలైంది. ఇందులో సంజయ్ వర్మ, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రీమ్జ్ యానిమేషన్స్ (ప్రై) లిమిటెడ్ బ్యానర్‌పై తమటం కుమార్ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టీ రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్‌కు చిత్ర నిర్మాతల్లో ఒకరైన తమటం కుమార్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ.. ‘’చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నాను. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో సంజయ్‌కి కెరీర్ ఆరంభంలోనే ఇంత మంచి కథ లభించడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి. నిర్మాతకు బాగా డబ్బులు, దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను’’ అని అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ..’’ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ చెప్పిన కథ వినగానే వెంటనే ఓకే చెప్పాను. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. ‘ఒక చిన్న విరామం’, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ‘ చిత్రా్లో హీరోగా నటించిన సంజయ్ వర్మ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో హైదరాబాద్‌లోనే చిత్రకరణ పూర్తి చేస్తాం’’ అని అని తెలిపారు.

దర్శకుడు సాయికృష్ణ కేవీ మాట్లాడుతూ... ‘’కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిది. సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనల నుంచి స్పూర్తి పొంది చేస్తున్న సినిమా ఇది’’ అని చెప్పారు.

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, వసుధ, సిమ్రాన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు, భూషణ్, బాబీ, దొరబాబు, హర్ష తదితరులు

More News

బీజేపీలోకి జానారెడ్డి.. నాగార్జున సాగర్ నుంచి బరిలోకి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై దారుణంగా పడనుందా? కౌంటింగ్ ముగిసిన గంటల్లోనే అనూహ్య పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ వేదికవుతోందా?

వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే రాపాక తనయుడు...

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనయుడు రాపాక వెంకట్రామ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆమె ఓటమి స్వయంకృతాపరాధం.. ఆసక్తికరంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి..

స్వయం కృతాపరాధం.. అనే మాటను తరచూ వింటూనే ఉంటాం. అలాంటి స్వయం కృతాపరాధమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి కొంపముంచింది.

ఎవరికీ రాని మేజిక్ ఫిగర్.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు..!

మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. గ్రేటర్ ప్రజానీకం అన్ని పార్టీలను గెలుపు ముంగిట నిలబెట్టేసి తేల్చుకోమని బిగ్ టాస్క్ ఇచ్చినట్టుగా అయింది.

రేస్ టు ఫినాలే విన్ అయిన అఖిల్.. ఓ మెట్టు ఎక్కిన అభి..

నైట్ అంతా కూడా సొహైల్, అఖిల్ కూడా కూర్చొనే ఉన్నారు. మీరింకా ఈ టాస్క్‌ని కంటిన్యూ చేయాలనుకుంటే మీకు కావల్సిన సపోర్ట్ నేనిస్తానని అభి చెప్పాడు.