బాహుబలిని కట్టప్ప చంపలేదట..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం బాహుబలి. ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో ఒకటే సందేహం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే బాహుబలి 2 చూడాల్సిందే అన్నారు.
కానీ...సమాధానం చెప్పలేదు బాహుబలి టీమ్. బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ ప్రశ్నఅడిగిన ప్రతిసారీ ఏదో సమాధానం చెబుతూ తప్పించుకున్నారు. అయితే..తాజాగా ఓ ఆంగ్లదిన పత్రికకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో విజయేంద్రప్రసాద్ ఈ ప్రశ్నకు సమాధానంగా...అసలు బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచినంత మాత్రానా చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నారు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియాలంటే బాహుబలి 2 వచ్చే వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments