కాటమరాయుడు టీజర్ విడుదల తేదీ

  • IndiaGlitz, [Friday,January 13 2017]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'.

ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో వినూత్న రీతిలో చేసిన 'కాటమరాయుడు' ప్రచారం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకి చిత్ర బృందం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. సంక్రాంతి కానుకగా మరికొన్ని ప్రచార చిత్రాలని విడుదల చేస్తున్నారు. చిత్రం మొదటి టీజర్ ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.

సంక్రాంతి విరామం తరువాత, 16న మొదలయ్యే షూటింగ్, ఏకదాటిగా జరగబోయే షెడ్యూల్ తో చిత్రం పూర్తవుతుంది. సినిమా 2017 మార్చి 29న 'ఉగాది' కి విడుదల కానుంది.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు

More News

మోక్షజ్ఞ తొలి చిత్రానికి నిర్మాత ఫిక్స్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ... సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు..? దర్శకుడు ఎవరు..? ఏ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది అనేది అఫిషియల్ గా ఇప్పటి వరకు ప్రకటించలేదు.

నాని 'నేను లోకల్' ఆడియో తేదీ

వరుస ఐదు చిత్రాల సక్సెస్ తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్ గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో ...

అమెరికాలో శాతకర్ణి కలెక్షన్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!

ధృవ చిత్రంతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

సంక్రాంతికి బేవర్స్ ఫస్ట్ లుక్

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.