కేంద్రం పై కాటమరాయుడు సెటైర్..!
Saturday, November 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని మోడీ బ్లాక్ మనీని అరికట్టేందుకు 500, 1000 నోట్ల రద్దు చేయడం పై పలు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే... కర్నూలులో తన డబ్బులు తీసుకోవడానికి మూడు రోజులుగా ప్రయత్నించి కుదరక ఎస్.బి. ఇండియా బ్యాంక్ లో మరణించిన బాలరాజు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాడమైన సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
అలాగే.... కేంద్రంలోని ఎం.పిలు అంతా ప్రజల కష్టాలకి సంఘీభావం తెలపడానికి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడితే బావుంటుంది. అలాగే ఆంధ్ర బిజెపి ఎం.పిలు తెలంగాణ ఎంపిలు కూడా ఎటిఎం ల దగ్గర బ్యాంక్స్ దగ్గర నిలబడి తమ వంతు మద్దతు ప్రకటిస్తే ప్రజలకి కాస్త ధైర్యంగా ఉంటుంది అంటూ సలహా లాంటి సెటైర్ ఏసేసారు. మరి...జనసేన సెటైర్ కి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments