కాట‌మ‌రాయుడు న్యూయ‌ర్ పోస్ట‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Wednesday,December 28 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని నార్ట్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే...దీపావ‌ళికి కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన టీమ్ నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా ఈరోజు కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.

పంచె క‌ట్టులో న‌డుస్తున్న‌ట్టు కేవ‌లం కాళ్లు మాత్రేమే క‌నిపించే కాట‌మ‌రాయుడు పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ల‌వ్, యాక్ష‌న్ ఎంట‌ర్ టైన్మెంట్...ఇలా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అన్ని అంశాల‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక కాట‌మ‌రాయుడు టీజ‌ర్ ను నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. ఇక ఈ భారీ చిత్రాన్ని ఉగాది కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.