కాట‌మ‌రాయుడుకు ముహుర్తం ఖ‌రారు..!

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

దీంతో అస‌లు ఈ సినిమా ఉందా..? లేదా..? అనే అనుమానాలు కూడా మొద‌ల‌య్యాయి. ఈ అనుమానాలు, ప్ర‌చారాల‌కు తెర దించుతూ ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను ఈ నెల 20 నుంచి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ నెల 24 నుంచి ఈ షూటింగ్ లో పాల్గొంటారని స‌మాచారం. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థగా రూపొందుతున్న‌ ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

More News

గూబ గుయ్ మ‌న్న‌ది ఎవ‌రికి..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రానికి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ...టాక్ తో సంబంధం లేకుండా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

అఖిల్‌కు హీరోయిన్ దొరికేసింది...?

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన అఖిల్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర స‌క్సెస్ కాలేదు. దాంతో ఓ ర‌కంగా నాగార్జున అండ్ అక్కినేని ఫ్యామిలీ డిస్ట్ర‌బ్ అయ్యారు.

ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్న రేణుదేశాయ్..!

రేణుదేశాయ్...ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఏక్టివ్ గా ఉంటూ త‌న అభిప్రాయాల‌ను పంచుకునే రేణుదేశాయ్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రి ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ అవుతున్నారు

మిలియ‌నీర్ అయిన నాని

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస విజ‌యాల‌తో ముందుకెళుతున్నాడు క‌దా..ఉంటే గింటే త‌ను కోటీశ్వ‌రుడై ఉండాలి. అలాంటిది త‌ను మిలియ‌నీర్ ఎలా అయ్యాడ‌నుకుంటున్నారా.

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంలో రోహిత్ హీరో కాడా....?

నారా రోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విభిన్న చిత్రాల క‌థానాయ‌కుడు నారా రోహిత్, ప్రేమ ఇష్క్ కాద‌ల్ చిత్రంలో రాయ‌ల్‌రాజు పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన శ్రీవిష్ణు క‌థానాయ‌కులుగా నిర్మించ‌బ‌డుతున్న చిత్రం `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు`.