కాటమరాయుడు ఫుల్ పోస్టర్ రిలీజ్..!
- IndiaGlitz, [Friday,December 30 2016]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రాన్ని నార్ట్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. న్యూయర్ సందర్భంగా మూడు రోజుల ముందే పోస్టర్స్ తో సందడి మొదలు పెట్టిన పవర్ స్టార్ కాటమరాయుడు ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
పవర్ ఫుల్ లుక్స్ తో, ఛైర్ లో కూర్చొన్న కాటమరాయుడు గెటప్ చూస్తుంటే ఈసారి హిట్ పక్కా అనిపిస్తుంది. ఈ పోస్టర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరింత పెంచింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, శృతిహాసన్ కలిసి నటిస్తుండడంతో సెంటిమెంట్ పరంగా కూడా విజయం ఖాయం అనిపిస్తుంది. ఇటీవల పొలాచ్చిలో షూటింగ్ జరుపుకున్న కాటమరాయుడు జనవరి నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేయనున్నాడని సమాచారం. ఉగాది కానుకగా కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.