ఈరోజు షూటింగ్ లో పాల్గొన్న కాటమరాయుడు
Monday, September 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ తర్వాత వెంటనే ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటికీ షూటింగ్ స్టార్ట్ చేయకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే అనుమానం మొదలైంది. ఆఖరి అనుమానాలకు ఫుల్ స్టాఫ్ పెడుతూ ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు.
ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో సరికొత్త లుక్ లో పవన్ కనిపించనున్నారు. ఈరోజు నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ ద్వారా పవన్ షూటింగ్ లో పాల్గొన్న స్టిల్ రిలీజ్ చేసి ఈ విషయాన్నితెలియచేసారు. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments