ఈరోజు షూటింగ్ లో పాల్గొన్న కాటమరాయుడు

  • IndiaGlitz, [Monday,September 26 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత వెంట‌నే ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ షూటింగ్ స్టార్ట్ చేయ‌క‌పోవ‌డంతో అస‌లు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే అనుమానం మొద‌లైంది. ఆఖ‌రి అనుమానాల‌కు ఫుల్ స్టాఫ్ పెడుతూ ఇటీవ‌ల ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు.
ఇక ఈరోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో స‌రికొత్త లుక్ లో ప‌వ‌న్ క‌నిపించ‌నున్నారు. ఈరోజు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్ షూటింగ్ లో పాల్గొన్న స్టిల్ రిలీజ్ చేసి ఈ విష‌యాన్నితెలియ‌చేసారు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది.

More News

ప్రేమంటే సూప‌ర్...అయితే ఆ విష‌యం గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడ‌ను - ప్ర‌భుదేవా

కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, డైరెక్ట‌ర్ గా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌చుకుని..ముఖ్యంగా ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ అనే క్రేజు -  ఇమేజు సొంతం చేసుకున్న‌ గ్రేట్ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా.

ప్రేమ‌మ్ థియేట్రిక‌ల్..2 మిలియ‌న్ వ్యూస్..!

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ లైవ్ షో

హీరో రామ్‌చ‌ర‌ణ్ హీరోగానే కాకుండా సామాజిక కార్య‌క్ర‌మాల్లో త‌న‌కు వీలున్న‌ప్పుడ‌ల్లా పాల్గొంటుంటాడు. రీసెంట్‌గా రిపబ్లిక్ హిందీ కొలిష‌న్(ఆర్‌.హెచ్‌.సి) అనే సంస్థ హ్యుమానిటీ అగెయినెస్ట్ టెర్ర‌ర్ అనే ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తున్నారు.

చైతు, సమంతల స్పెషల్ పూజలు...

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు ఇప్పుడు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వీరి పెళ్ళి ఉంటుందని అందరికీ అనధికారకంగా తెలిసిందే. అయితే ఎక్కడా అధికారకంగా ఎవరూ చెప్పలేదు.

సంపత్ నంది నిర్మాతగా కొత్త చిత్రం...

దర్శకుడు సంపత్ నంది సంపత్ టీం వర్క్స్ అనే బ్యానర్ను పెట్టి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గాలిపటం సినిమాను సంపత్ నంది నిర్మించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత సంపత్ నంది మళ్ళీ తన బ్యానర్పై మరో సినిమాను నర్మించనున్నాడు.