సంక్రాంతికి వ‌స్తున్న కాట‌మ‌రాయుడు..!

  • IndiaGlitz, [Monday,January 09 2017]

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత చిరంజీవి న‌టించిన చిత్రం రిలీజ్ అవుతుండ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఇదిలా ఉంటే...సంక్రాంతికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఫ్యాన్స్ ను అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం కాట‌మ‌రాయుడు.

ఈ చిత్రాన్ని డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల కాట‌మ‌రాయుడు పోస్ట‌ర్ రిలీజ్ చేసిన టీమ్ సంక్రాంతి కానుక‌గా ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని ఉగాది కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. సంక్రాంతికి ఓ వైపు అన్న‌య్య చిరంజీవి ఖైదీ నెం 150 మూవీ రిలీజ్ అవుతుండ‌డం, మ‌రో వైపు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజ్ చేస్తుండ‌డంతో ఫ్యాన్స్ కు పండ‌గే..!