'కాటమ రాయుడు' ఎమోషన్స్
- IndiaGlitz, [Sunday,March 19 2017]
- నాకు ఏ పని ఇచ్చినా చేస్తాను..అది వ్యవసాయమైనా, వీధుల ఊడ్చే పని అయినా నిజాయితీగా, నిసిగ్గుగా చేస్తాను. అలాగే నటన కూడా ఓ బాధ్యతగా భావించి చేశాను. భవిష్యత్‌లో ఏ పని ఇచ్చినా, అలాగే చేస్తాను( రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఇన్ డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్య చేశాడు)
- పవర్ అంటే సమాజానికి సేవ చేయడమే అనుకుని రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాను. సక్సెస్ వస్తే మంచిది..రాకుంటే మరీ మంచింది
- నాకు నా పిల్లలు మీ పిల్లలు అని తేడా లేదు. నా దృష్టిలో అందరూ సమానమే.
- త్రివిక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినా సినిమా గోకులంలో సీత సినిమా గురించి ప్రస్తావిస్తూ..సాధారణంగా నాకు నా సినిమాలోని డైలాగ్స్ గుర్తుండవు. చాలా తక్కువగానే గుర్తుంటాయి. అలా గోకుంలో సీత సినిమాలో ప్రేమే దైవం, ప్రేమే సృష్టి మనుగడకు మూలం అని తెలుసుకున్నా..అనే డైలాగ్ చాలా ఇంపాక్ట్ చూపింది.
- సుస్వాగతం సినిమాలో ప్రేమ గురించి తిరిగే కుర్రాడి పాత్రలో నటిచాను. ఆ సినిమాలో తండ్రి చనిపోయిన సీన్‌లో నేను నిజంగానే ఏడ్చాను. ఆ సీన్ చేయడానికి 40 టేక్స్ తీసుకున్నాను. చెంపలపై కొట్టుకుంటూ ఏడ్చే సీన్ కాబట్టి ఆసీన్ చేసేటప్పటికీ నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. సీన్ అయిపోయిన తర్వాత కూడా ఏడుస్తూ ఉండిపోయాను.ఆలోచన తప్పని తెలిసినా నిజంగా మా నాన్నగారు చనిపోతే నేను ఏడుస్తానా? అని ఆలోచించాను. జల్సా సినిమా చేసే సమయంలో నాన్న చనిపోతే..నేను ఏడవలేదు. ఎందుకంటే నేను అప్పటికే చాలా ఏడ్చేశాను.
- తమ్ముడు సినిమాలో నువ్వు ఈ పని చేయలేవని చెప్పే చాలా మందికి..నేను చేయగలనని యువత చేసి చూపిస్తుందని, నా హద్దులు ఇదని చెప్పడానికి నువ్వెరని చెప్పే ప్రయత్నంలో భాగంగా తమ్ముడులో 'లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్..' అనే సాంగ్ పెట్టాను. అలాగే బద్రి సినిమాలో నువ్వు నంద అయితే నేను బద్రి.., బ్రదినాథ్ అనే చెప్పే డైలాగ్‌లో నీకు డబ్బు, పలుకుబడి ఏదైనా ఉండవచ్చుకానీ..నువ్వు కూడా నాలాంటి రక్తమాంసాలున్న మనిషివే అని చెప్పడానికి ప్రయత్నించాను. ఖుషీ సినిమాలో మన దేశాన్ని, ప్రాంతాన్ని ప్రేమించాలి. వెరోకరికి నా ప్లేస్‌లో పనేంటి? అని చెప్పాను.
- ఖుషీ సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్‌లో నీకు ఇకపై చెడ్డరోజులే అని ఏదో శక్తి నాకు చెప్పినట్లు అనిపించింది. నేను బయటకు వచ్చేశాను. అయితే నా వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాను. గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు నా శక్తిని తిరిగి పొందినట్టు అనిపించింది. (ఖుషీ తర్వాత దశాబ్దం పాటు పవన్ కు హిట్స్ లేవు)
- సుస్వాగతం సినిమా 200 డేస్ ఫంక్షన్ కర్నూలులో జరిగినప్పుడు ఐదు కిలోమీటర్లు ఊరేగింపుగా తీసుకెళతామని అన్నారు. నేను వద్దన్నాను. ఎందుకంటే ప్రేక్షకులు నన్ను ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాను. వారు నాపై చూపించే ప్రేమకు నేనేలా రియాక్ట్ కావాలో తెలియలేదు. చివరకు రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాను. నిరంతర పోరాటమే జీవితం. ఓరోజు పడిపోతాం. మరోసారి లేస్తాం. గెలుపోటముల్ని సమానంగా చూడాలనిపించింది.
- నాకు అన్నయ్య చిరంజీవిగారే హీరో..నాకు నేను హీరోగా ఎప్పుడూ ఫీల్ కాను.